Rohit Sharma : అదే బాల్ అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. రోహిత్ శర్మతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు మరి…!
ప్రధానాంశాలు:
Rohit Sharma : అదే బాల్ అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. రోహిత్ శర్మతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు మరి...!
Rohit Sharma : ధర్మశాల వేదికగా భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో తొలిరోజు 52 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ రెండవ రోజు కూడా అదే దూకుడు ప్రదర్శిస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 154 బంతుల్లో 13 ఫోర్స్ , 3 సిక్స్ లతో రోహిత్ శర్మ అదరగొట్టాడు. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ ఇంగ్లాండ్ స్టార్ పెసర్ మార్కు వుడ్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు. తన స్టైల్ పై దెబ్బ కొట్టాలి అనుకుంటే తాను ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పకనే చెప్పి చేసి మరి చూపించాడు. ఇంతకీ ఈ టెస్ట్ మ్యాచ్ లో మార్క్ మరియు రోహిత్ శర్మల మధ్య అసలు ఏం జరిగింది అనే విషయాల గురించి ఇప్పుడు చర్చిద్దాం. అయితే భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లులు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇక ఈ సిరీస్ లో భాగంగా రాజ్ కోట్ వేదికగా భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య 3వ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్ లోనే సెంచరీ తో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ ఫేసర్ మార్క్ వుడ్ బౌన్సర్లు మరియు షాట్ బాల్స్ వేస్తూ రోహిత్ ను కాస్త కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే మరింత వేగం పెంచి రోహిత్ శర్మ ఫేస్ ను టార్గెట్ చేస్తూ మార్క్ షాట్ బాల్స్ వేయడం జరిగింది.అయితే వాస్తవానికి రోహిత్ శర్మకు షార్ట్ బాల్స్ వేస్తే వాటిని ఎంతో అద్భుతంగా ఆడగలడు. సునాయాసంగా సిక్సులు కొట్టేస్తాడు. కానీ మార్క్ వేస్తున్న ఫేసర్ బౌన్స్ ఎక్కువగా ఉండటంతో బాలు వేగంగా దూసుకు వచ్చి రోహిత్ హెల్మెట్ కి తగిలింది. దీంతో రోహిత్ శర్మ పై తానేదో విజయం సాధించిన తీరుగా మార్క్ వుడ్ ప్రవర్తించాడు. అయితే ప్రస్తుతం ధర్మశాల వేదికగా జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ లో కూడా మార్క్ రోహిత్ శర్మ పై ఇలాంటి స్ట్రాటజీ ప్లే చేసే ప్రయత్నం చేశాడు.
కానీ ఈసారి లెక్క మారింది. ఎందుకంటే ఇక్కడ రోహిత్ తన బలం ఏంటో చూపించాడు. మార్క్ వుడ్ కు మెంటల్ ఎక్కేలా ఫుల్ షాట్ బాల్స్ వేస్తే తన పవర్ ఎలా ఉంటుందో రోహిత్ శర్మ చూపించాడు. ఇక గంటకు 151.2 కిలోమీటర్ల వేగంతో వస్తున్న బంతిని రోహిత్ శర్మ సునాయాసంగా సిక్స్ కొట్టాడు. దీంతో ప్రతిసారి తనపై షార్ట్ బాల్స్ బౌన్సర్లు వేసి తనని అడ్డుకోలేడని మార్క్ కి రోహిత్ శర్మ చెప్పకనే చెప్పాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక 3వ టెస్ట్ మ్యాచ్ లో హెల్మెట్ కు తగిలిన బాల్ కు ప్రతికారంగా రోహిత్ ఇప్పుడు బదులు ఇచ్చాడని అభిమానులు చెబుతున్నారు. ఇక ఈ రెండు వీడియోలు కలిపి యాక్షన్ రియాక్షన్ అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది.మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
View this post on Instagram