Deepak Hooda : ఛీ.. దీపక్ హుడా ఆటైపా..?
ప్రధానాంశాలు:
Deepak Hooda : ఛీ..దీపక్ హుడా ఆటైపా..?
Deepak Hooda : ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ స్వీటీ బోరా – ఆమె భర్త దీపక్ హుడా మధ్య వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇటీవల వీరి మధ్య జరిగిన ఘర్షణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం మరింత ముదిరింది. స్వీటీ బోరా తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేస్తూ అతనికి అబ్బాయిలంటే ఆసక్తి ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహానికి ముందు దీపక్ హుడా గురించి తనకు తెలియదని, తర్వాతే అసలు నిజాలు తెలిశాయని పేర్కొంటూ స్వీటీ బోరా విడాకులు కోరుతూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది.

Deepak Hooda : ఛీ..దీపక్ హుడా ఆటైపా..?
Deepak Hooda : దీపక్ హుడా గురించి ఆ రహస్యాలు తెలిపిన స్వీటీ బోరా
తన భర్తకు నైతిక విలువలు లేవని, అతనితో కలిసి జీవించడం ఇకపై సాధ్యమే కాదని, తనకు విడాకులే ముఖ్యమని ఆమె స్పష్టం చేసింది.ఇదిలా ఉంటె స్వీటీ బోరా – దీపక్ హుడా మధ్య పోలీస్ స్టేషన్‌లో జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీపక్ తనను వేధించాడని, తనను బలవంతంగా చెడుగా చూపించేలా కుట్ర పన్నాడని స్వీటీ బోరా ఆరోపించింది. తనను ఫిజికల్‌గా కూడా హింసించాడని, తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది. దీపక్ హుడా కూడా స్వీటీ బోరా తన ఆస్తిని ఆక్రమించేందుకు ప్రయత్నించిందని, తనను మానసికంగా, శారీరకంగా వేధించిందని చెప్పాడు.
నిద్రిస్తున్నప్పుడు తన తలపై దాడి చేసిందని, కత్తితో కూడా తనపై దాడి చేసిందని ఆరోపించాడు. ఇలా ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేయడంతో హిసార్, రోహ్తక్ పోలీస్ స్టేషన్లలో క్రాస్ కేసులు నమోదయ్యాయి. మరి కోర్ట్ వీరి వ్యవహారం పై ఎలా స్పందిస్తుందో..? విడాకులు ఇస్తుందో లేదో చూడాలి.