Shikhar Dhawan : శిఖర్ ధావన్ ఇంట్లో ఘోరం.. వెలుగులోకి భార్య ఆయేషా అరాచకాలు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shikhar Dhawan : శిఖర్ ధావన్ ఇంట్లో ఘోరం.. వెలుగులోకి భార్య ఆయేషా అరాచకాలు?

 Authored By kranthi | The Telugu News | Updated on :5 October 2023,7:00 pm

Shikhar Dhawan : టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయన మాజీ భార్య ఆయేషా ముఖర్జీ ఎట్టకేలకు విడిపోయారు. వీళ్లు చాలా రోజుల నుంచి విడిగా ఉంటున్నారు. అలాగే వీళ్లు విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. కానీ.. విడాకులు చాలా రోజుల తర్వాత కోర్టు తాజాగా మంజూరు చేసింది. ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు ఇచ్చింది. ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసించిందని.. తనతో ఇక కలిసి ఉండలేనని శిఖర్ ధావన్ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. దానిపై విచారణ చేసిన కోర్టు శిఖర్ ధావన్ చేసిన ఆరోపణలు కరెక్టే అని విడాకులు ఇచ్చింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు చివరకు విడాకులు మంజూరు చేసింది. అయితే.. వీళ్ల కొడుకు విషయంలో మాత్రం ఇంకా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయేషానే ప్రస్తుతానికి తన కొడుకు బాగోగులు చూసుకుంటోంది. నిజానికి ఆయేషా ఆస్ట్రేలియాలో స్థిరపడింది. తనది వెస్ట్ బెంగాల్. తనకు ఇదివరకే పెళ్లి అయి విడాకులు తీసుకుంది. తన మొదటి భర్త ద్వారా ఇద్దరు కూతుళ్లు కూడా తనకు ఉన్నారు.

మొదటి భర్తతో విడాకుల తర్వాత తను శిఖర్ ధావన్ తో రిలేషన్ షిప్ లో ఉంది. ఆ తర్వాత తను ఇండియాకు తిరిగి వస్తా అని శిఖర్ కు భరోసా ఇవ్వడంతో ధావన్ కూడా తన మాటలు నమ్మి పెళ్లి చేసుకున్నాడు. కానీ.. తన ఇద్దరు కుమార్తెలను వదిలిపెట్టలేక తను ఇండియాకు రాలేదు. ఇంతలో వీళ్లకు ఒక కొడుకు జన్మించాడు. కొడుకును కూడా ఆస్ట్రేలియాలోనే పెంచి పెద్ద చేసింది ఆయేషా. తన కొడుకును ధావన్ కు కొన్నేళ్ల పాటు దూరం చేసి కనిపించకుండా చేసి తనను మానసిక వేదనకు గురి చేసిందని కోర్టు నమ్మింది. అలాగే.. తాను సంపాదించిన ఆస్తులను ఆయేషా తన పేరు మీద రాయాలని శిఖర్ పై ఒత్తిడికి గురి చేసిందని విచారణలో తేలింది. ధావన్ కు పరువు నష్టం కూడా కలిగేలా చేసింది. అంతే కాకుండా ఆస్ట్రేలియాలో ఉన్న తమ ఇద్దరు కుమార్తెల స్కూల్ ఫీజుల కోసం కూడా ధావన్ నుంచే డబ్బులు వసూలు చేసింది.

shikar dhawan and ayesha mukherjee divorce

#image_title

Shikhar Dhawan : నెలకు కోటి రూపాయలు పంపాలంటూ ధావన్ కు ఒత్తిడి

తమ కుమార్తెల చదువు కోసం నెలకు కోటి రూపాయలు పంపాలంటూ ధావన్ కు ఒత్తిడికి గురి చేసినట్టు కోర్టు గుర్తించింది. ఈ ఆరోపణలపై ఆయేషా ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో ధావన్ ఆరోపణలనే కోర్టు పరిగణనలోకి తీసుకుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కోర్టు ధావన్, ఆయేషాకు విడాకులు మంజూరు చేసింది. ఎనిమిదేళ్ల వయసులోనే ఆస్ట్రేలియాకు వెళ్లిపోయిన ఆయేషా.. అక్కడే కిక్ బాక్సర్ గా ఎదిగి.. ఒక బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టాక వాళ్లు విడిపోయారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ ద్వారా శిఖర్ పరిచయం కావడంతో శిఖర్ ను రెండో పెళ్లి చేసుకుంది. 2012 లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. శిఖర్ కంటే ఆయేషా 10 ఏళ్లు వయసులో పెద్దది. పెళ్లి తర్వాత ఆయషా ఇద్దరు పిల్లల బాధ్యత కూడా శిఖర్ చూసుకునేవాడు.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది