SRH vs RR IPL : మరి కొద్ది గంటలలో ఉప్పల్‌లో ఉగ్రరూపం.. స్కోర్ బోర్డ్ 300 దాటుతుందా?
ప్రధానాంశాలు:
SRH vs RR IPL : మరి కొద్ది గంటలలో ఉప్పల్‌లో ఉగ్రరూపం.. స్కోర్ బోర్డ్ 300 దాటుతుందా?
SRH vs RR IPL : ఐపీఎల్ 2025లో మరో ఆసక్తికర పోరుకు సమయం సిద్ధమైంది. ఈ రోజు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఉప్పల్ స్టేడియంలో జరిగిన గత ఆరు మ్యాచుల ఫలితాలు చూస్తే.. ఐదింటిలో సన్‌రైజర్స్ హైదరాబాదే విజయం సాధించింది. ఇక రాజస్థాన్ రాయల్స్ తో పోటీపడిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ హైదరాబాదే గెలిచింది.

SRH vs RR IPL : మరి కొద్ది గంటలలో ఉప్పల్‌లో ఉగ్రరూపం.. స్కోర్ బోర్డ్ 300 దాటుతుందా?
వాళ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మొదలుకానున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ రెండు జట్లలో ఎస్ఆర్ హెచ్ జట్టే బలంగా కనిపిస్తుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీతో హైదరాబాద్ టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది.
ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం కావడంతో… హెడ్, అభిషేక్, క్లాసెన్‌లు ఉగ్రరూపం చూపిస్తే మూడు వందల స్కోరు అవలీలగా రాబట్టొచ్చు. ఇక ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ కూడా ఏమాత్రం తక్కువ లేదు. యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హెట్మేయర్ రూపంలో ఆ జట్టు బలమైన బ్యాటింగ్ దళాన్ని కలిగి ఉంది. ఇవాళ్టి ఉప్పల్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఉగ్రరూపం చూపిస్తే మాత్రం పరుగుల వరద పారడం ఖాయం అంటున్నారు