Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ దెబ్బ‌కు ఎస్ఆర్‌హెచ్‌కి క్లిష్టంగా మారిన ప్లే ఆఫ్ ఛాన్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ దెబ్బ‌కు ఎస్ఆర్‌హెచ్‌కి క్లిష్టంగా మారిన ప్లే ఆఫ్ ఛాన్స్..!

Suryakumar Yadav : ఇప్పుడు ఐపీఎల్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఏ జ‌ట్లు ప్లే ఆఫ్స్‌కి వెళ‌తాయ‌నే దానిపై కాస్త స‌స్పెన్స్ అయితే ఉంది. ఆర్సీబీ, ముంబై దాదాపు ప్లే ఆఫ్స్ నుండి త‌ప్పుకున్న‌ట్టే. అయితే గ‌త రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించి అభిమానుల‌కి కాస్త సంతృప్తిని ఇచ్చింది. ఈ విజ‌యంతో పట్టికలో ఒక స్థానం ఎగబాకి 9వ స్థానానికి చేరుకుంది. మ్యాచ్‌లో […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 May 2024,12:00 pm

Suryakumar Yadav : ఇప్పుడు ఐపీఎల్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఏ జ‌ట్లు ప్లే ఆఫ్స్‌కి వెళ‌తాయ‌నే దానిపై కాస్త స‌స్పెన్స్ అయితే ఉంది. ఆర్సీబీ, ముంబై దాదాపు ప్లే ఆఫ్స్ నుండి త‌ప్పుకున్న‌ట్టే. అయితే గ‌త రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించి అభిమానుల‌కి కాస్త సంతృప్తిని ఇచ్చింది. ఈ విజ‌యంతో పట్టికలో ఒక స్థానం ఎగబాకి 9వ స్థానానికి చేరుకుంది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్ అనుకున్నంత‌గా రాణించ‌లేక‌పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది.

సూర్య ధ‌మాకా

ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48), ప్యాట్ కమిన్స్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స్‌లతో 35 నాటౌట్) మాత్రమే కాస్త చెప్పుకోద‌గ్గ స్కోరు చేశారు. మిగ‌తా వారందరు అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయారు. ఎవ‌రు కూడా కొద్ది సేపు క్రీజులో నిల‌వ‌లేక‌పోయారు. హెడ్‌కి రెండు అవకాశాలు వ‌చ్చిన కూడా దానిని స‌ద్వినియోగ‌ప‌రుచుకోలేక‌పోయాడు. ఇక లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఆరంభంలోనే 3 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ అభేద్యమైన నాలుగో వికెట్ కి ఏకంగా 143 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి జట్టును విజయ తీరానికి చేర్చారు. సూర్యకుమార్ సెంచరీ (51 బంతుల్లో 102, 12 ఫోర్లు, 6 సిక్సర్లు) చేయగా, తిలక్ 37 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

IPL 2024

IPL 2024

174 పరుగుల లక్ష్యచేధనలో ఓపెనర్స్ మంచి శుభారంభం అందించ‌లేక‌పోయారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్(9), రోహిత్ శర్మ(4) వెంట‌వెంట‌నే ఔట‌య్యారు. మార్కో జాన్సెన్ వేసిన రెండో ఓవర్‌లో ఇషాన్ కిషన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిర‌గ‌గా.. కమిన్స్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ శర్మ చెత్త షాట్ ఆడి పెవీలియ‌న్ బాట ప‌ట్టాడు. త‌ర్వాత వ‌చ్చిన న‌మన్ ధీర్ డ‌కౌట్ అయ్యాడు. ఆ త‌ర్వాత సూర్య‌, తిల‌క్ కాస్త నిధానంగా ఆడుతూ వీలున్న‌ప్పుడ‌ల్లా భారీ షాట్స్ ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచారు. ముపై బంతుల్లో అర్ధ సెంచ‌రీ చేసిన సూర్య ఆ త‌ర్వాత రెచ్చిపోయి ఆడారు. సెంచ‌రీ చేసి టీమ్‌ని గెలిపించారు. అయితే ఈ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చివరి మూడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు రెండు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది