Surya Kumar Yadav : టీమిండియా ఫ్యాన్స్‌కు భారీ షాక్.. సూర్యకుమార్ యాదవ్ కు గాయం.. టీ20 వరల్డ్ కప్ కు దూరం అయినట్టేనా?
Surya Kumar Yadav : టీమిండియా ఫ్యాన్స్ కు ఇది భారీ షాక్ అనే చెప్పుకోవాలి. టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కు చీలమండ వద్ద గాయం అయింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ చేస్తూ కిందపడ్డాడు. దీంతో అతడి చీలమండకు తీవ్రగాయం అయింది. దీంతో వచ్చే సంవత్సరం జనవరిలో జరగబోయే టీ20 సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్ దూరం అయినట్టే. సూర్యకుమార్ యాదవ్.. జనవరిలో ఆఫ్ఘనిస్థాన్ తో […]
ప్రధానాంశాలు:
టీ20 వరల్డ్ కప్ కు సూర్య కుమార్ యాదవ్ దూరం కాబోతున్నాడా?
దక్షిణాఫ్రికా మ్యాచ్ లో సూర్యకు చీలమండలో గాయం
సర్జరీ చేయాలన్న వైద్యులు
Surya Kumar Yadav : టీమిండియా ఫ్యాన్స్ కు ఇది భారీ షాక్ అనే చెప్పుకోవాలి. టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కు చీలమండ వద్ద గాయం అయింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ చేస్తూ కిందపడ్డాడు. దీంతో అతడి చీలమండకు తీవ్రగాయం అయింది. దీంతో వచ్చే సంవత్సరం జనవరిలో జరగబోయే టీ20 సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్ దూరం అయినట్టే. సూర్యకుమార్ యాదవ్.. జనవరిలో ఆఫ్ఘనిస్థాన్ తో జరగబోయే టీ20 సిరీస్ లో ఆడాలి. కానీ.. తీవ్రమైన గాయం కావడంతో దూరం కావాల్సి వచ్చింది.
తనకు అయిన గాయం వల్ల సర్జరీ చేయాల్సిందే అని డాక్టర్లు వెల్లడించారు. అయితే.. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయిన విషయం తెలిసిందే. సెంచరీ చేసి మరీ భారత్ ను గెలిపించాడు. మూడో టీ20లో గెలవడంతో సిరీస్ ను టీమిండియా సమం చేసింది. అయితే.. సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బాల్ ను ఆపబోయిన సూర్య కుమార్ యాదవ్.. కాలుతో బంతిని ఆపబోయి వెనక్కి కాలును ట్విస్ట్ చేశాడు. దీంతో కాలు పట్టేసింది. అంతే.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది అతడిని స్ట్రెచర్ పై ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Surya Kumar Yadav : టీ20లలో సత్తా చాటుతున్న సూర్య కుమార్ యాదవ్
సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం టీ20లలో సత్తా చాటుతున్నాడు. కేవలం టీ20 మ్యాచ్ ల్లో తన ప్రతిభ కనబరుస్తుండటంతో వన్డే, టెస్ట్ మ్యాచ్ లలో సూర్య కుమార్ యాదవ్ ను టీమిండియా సెలెక్టర్లు పక్కన పెట్టారు. కానీ.. త్వరలోనే టీ20 కెప్టెన్ ను చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కు గాయం కావడంతో అది టీ20 వరల్డ్ కప్ మీద కూడా ప్రభావం చూపేలా ఉంది. ఎందుకంటే.. జూన్ 2024 లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. అప్పటి వరకు సూర్య కుమార్ యాదవ్ కోలుకుంటే ఓకే.. లేదంటే టీ20 వరల్డ్ కప్ కు కూడా సూర్య కుమార్ యాదవ్ దూరం అయ్యే అవకాశం ఉంది.