Big Breaking : T20 ప్రపంచ కప్ 2022 విజేత ఇంగ్లాండ్..!
Big Breaking : T20 ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ హోరా హోరీగా సాగింది. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్ లు మాదిరిగానే ఈ ఫైనల్ మ్యాచ్ కూడా చివరి వరకు రెండు టీమ్స్ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. కానీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ బాబర్ (32), షాన్ మసూద్ (38) పరుగులతో రాణించారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరన్ 3 వికెట్లు తీసి అదరగొట్టాడు. కరన్ నాలుగు ఓవర్లు వేసి 12 రన్స్ మాత్రమే ఇచ్చి… పాకిస్తాన్ బ్యాట్స్మెన్లను ముప్పుతెప్పులు పెట్టాడు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో సూపర్ 12 నుంచి అత్యధిక వికెట్లు తీసింది కరనే. ఇంకా ఇంగ్లాండ్ బౌలర్లలో రషీద్ 2, జోర్డాన్ 2 వికెట్లు మాత్రమే తీసి పాకిస్తానీ దెబ్బ కొట్టారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ ప్రారంభంలో రెండు ఓవర్లలో చాలా దూకుడుగా ఆడింది. ఇక ఇదే సమయంలో పాకిస్తాన్ పెసర్లు కూడా విజృంభించారు.
దీంతో ప్రారంభంలోనే ఇంగ్లాండ్ టీంలో అతి ముఖ్యమైన బ్యాట్స్ మెన్ లు హేల్స్, బట్లర్, సాల్ట్ అవుట్ అయిపోయారు. దీంతో ఇంగ్లాండ్ టీం ఒత్తిడిలోకి వెళ్ళింది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్… ప్రత్యర్థి జట్టుని మరింత ఒత్తిడిలోకి తీసుకెళ్లే రీతిలో అద్భుతమైన బౌలింగ్ తో రాణించింది. అయినా గాని ఇంగ్లాండ్ ఆటగాళ్లలో బెన్ స్టొక్స్ కీలక సమయంలో హాఫ్ సెంచరీ చేసి ఇంగ్లాండ్ ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐదు వికెట్ల నష్టానికి 138 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో ఛేదించింది. దీంతో ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్ గెలవడం జరిగింది.