Hardik Pandya: మరోసారి పెళ్లికి రెడీ అవుతున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా..?
Hardik Pandya: ప్రస్తుతం టీమిండియా జట్టులో కీలకంగా రాణిస్తున్న ఆటగాడు హార్దిక్ పాండ్యా. బౌలింగ్ ఇంకా బ్యాటింగ్ పరంగా ఆల్ రౌండర్ గా తిరుగులేని గేమ్ ఆడుతూ జట్టును గెలిపించడంలో ఇటీవల ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నాడు. గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. మిడిల్ ఆర్డర్ లో దిగి చాలా కూల్ బ్యాటింగ్ స్టైల్ లో… ఒత్తిడిలో కూడా ప్రత్యర్థుల బౌలింగ్ నీ చీల్చి చెండాడటంలో ఎప్పుడు ముందుంటాడు. అటువంటి హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్ళికి రెడీ కావడం జరిగిందట.
విషయంలోకి వెళ్తే.. తన భార్య నటాషాను ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14వ తారీఖున మరోసారి పెళ్లాడనున్నాడట. ఈ వివాహ కార్యక్రమం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరుగుతోంది. నేటి నుంచి అనగా ఫిబ్రవరి 13 నుంచి 16 వరకు హల్ది, మెహందీ, సంగీత వేడుకలు జరుగుతాయని సమాచారం. అప్పట్లో దేశంలో కరోనా వచ్చిన ప్రారంభంలో 2020 మే 31వ తారీఖున కేవలం కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది.

Team India all rounder Hardik Pandya getting ready for marriage once again
ఈ క్రమంలో ఒక కొడుకు కూడా కొట్టడం జరిగింది. అయితే ఇప్పుడు దేశంలో కరోనా పరిస్థితి తగ్గటంతో పాటు చాలా వరకు కేసులు లేకపోవడంతో ఇప్పుడు బంధుమిత్రులు మరియు ఆత్మీయుల సమక్షంలో… తన భార్య నటాషాను మరోసారి హార్దిక్ పాండ్యా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి టీమిండియా స్టార్ ప్లేయర్లతోపాటు బీసీసీఐకీ బోర్డు మెంబర్స్ కూడా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.