Team India : రిషబ్ పంత్ ను పక్కన పెట్టేసిన టీమ్ ఇండియా .. ఇప్పటికైనా సంజు శాంసస్‌కి ఛాన్స్ ఇస్తారా మరి ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Team India : రిషబ్ పంత్ ను పక్కన పెట్టేసిన టీమ్ ఇండియా .. ఇప్పటికైనా సంజు శాంసస్‌కి ఛాన్స్ ఇస్తారా మరి ?

Team India : బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. బంగ్లాదేశ్ టీమ్ ఇండియా ఓడిపోవడా న్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 3 వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్ వెళ్లిన టీమిండియా ఆదివారం నాడు తొలి వన్డే ను ఆడింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా టాపార్డర్‌ లోయర్ ఆర్డర్ కావడంతో 41.2 ఓవర్లలో కేవలం 186 పరుగులకే ఆల్ అవుట్ అయింది. బ్యాటింగ్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :5 December 2022,8:30 pm

Team India : బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. బంగ్లాదేశ్ టీమ్ ఇండియా ఓడిపోవడా న్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 3 వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్ వెళ్లిన టీమిండియా ఆదివారం నాడు తొలి వన్డే ను ఆడింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా టాపార్డర్‌ లోయర్ ఆర్డర్ కావడంతో 41.2 ఓవర్లలో కేవలం 186 పరుగులకే ఆల్ అవుట్ అయింది. బ్యాటింగ్ టఫ్ గా ఉండడంతో టీమిండియా బౌలర్స్ బంగ్లాదేశ్ బాటర్లను ఇబ్బంది పెట్టారు. కానీ బంగ్లాదేశ్ గెలుస్తుందని ఎవరు అనుకోలేదు.

ఈ మ్యాచ్ ఓడిపోవడం అసలు కారణం కేఎల్ రాహుల్ అని ఫాన్స్ మండిపడుతున్నారు.ఇప్పటికే T20 వరల్డ్ కప్ సెమిస్లో ఓటమిన్ ఎదుర్కొన్న టీమిండియా ఇప్పుడు బంగ్లాదేశ్ పై కూడా ఓడిపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో మార్పులు చేస్తే బాగుంటుందని చర్చించుకుంటున్నారు. టీం ఇండియాలో ఆడడానికి ఎంతోమంది ఎదురుచూస్తున్న కేఎల్ రాహుల్ చేత వికెట్ కీపింగ్ చేయించడం బాలేదని ఫ్యాన్స్ అంటున్నారు. బంగ్లాదేశ్ ను గెలిపించిన మెహిది తన ఇన్నింగ్స్ ఆరంభంలో ఇచ్చిన తొలి క్యాచ్ ను కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు. అయితే టీం ఇండియా జట్టు నుంచి రిషాబ్ పంత్ ను తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

Team India kept Rishabh Pant aside

Team India kept Rishabh Pant aside

అయితే ఈ నిర్ణయం మ్యాచ్కు ముందే ప్రకటించింది బీసీసీఐ. మెడికల్ టీం సిఫారసు మేరకు పంత్ ను వన్డే సిరీస్ నుంచి తొలగిస్తున్నట్లు బీసిసిఐ ప్రకటించింది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో ఆడినప్పుడు పంత్ మెడ నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఆ కారణంతోనే పంతుకు రెస్ట్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పంత్ తిరిగి టెస్ట్ సీరీస్ కు అందుబాటులో ఉంటాడని తెలిపింది.అయితే క్రికెట్ అభిమానులు పంత్ ను టీమ్ ఇండియా నుంచి తొలగిచాలని డిమాండ్ చేస్తున్నాడు. అతని స్థానంలో సంజు శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే పంత్ ను పక్కన పెట్టేసిన బి సి సిఐ అతని ప్లేస్ లో ఎవర్ని తీసుకోవడం లేదని చెబుతుంది…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది