Jai Shah : బ్యాట్ పట్టడం కూడా చేతకాని జై షాకి అంత బిల్డప్ అవసరమా.. నెట్టింట ట్రోలింగ్.. వీడియో !
ప్రధానాంశాలు:
Jai Shah : బ్యాట్ పట్టడం కూడా చేతకాని జై షాకి అంత బిల్డప్ అవసరమా.. నెట్టింట ట్రోలింగ్.. వీడియో !
Jai Shah : భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ జై షాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ బలంతో గత కొన్నాళ్లుగా బీసీసీఐ షాడో ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న జై షా.. అనాలోచిత నిర్ణయాలతో భారత జట్టుకు తీవ్ర నష్టం చేస్తున్నాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Jai Shah : బ్యాట్ పట్టడం కూడా చేతకాని జై షాకి అంత బిల్డప్ అవసరమా.. నెట్టింట ట్రోలింగ్.. వీడియో !
Jai Shah : అంత బిల్డప్ అక్కర్లేదు..
అసలు జై షాకు క్రికెట్‌తో ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం అతను క్లబ్ క్రికెట్ అయినా ఆడాడా..? అని ప్రశ్నిస్తున్నారు. మైదానంలో చిన్న పిల్లాడిలా కింది నుంచి వచ్చే బంతులను ఆడే జై షా స్టార్ క్రికెటర్ మాదిరిగా బిల్డప్ ఇస్తారంటూ ట్రోల్ చేస్తున్నారు. గంగూలీ ప్రెసిడెంట్‌గా ఉంటే తన ఆటలు సాగడం లేదని జైషా దాదాను తప్పించాడని ఆరోపిస్తున్నారు.
ఐసీసీ రీసెంట్‌గా రిలీజ్ చేసిన WTC విన్నింగ్ వీడియోలో.. కెప్టెన్ బావుమా కంటే జై షా క్లిప్పులే ఎక్కువ కనిపించాయి. సినిమాటిక్ లెవెల్‌లో జై షా క్లోజప్ షాట్స్ తీసి మరీ.. ఆ వీడియోలో ఇరికించింది ఐసీసీ. అతడేమైనా సౌతాఫ్రికా తరఫున క్రికెట్ ఆడాడా? పోనీ ఆ జట్టుకి కోచ్‌గా వ్యవహరించాడా? బ్యాట్ చేత పట్టి తానే ఆ జట్టుని గెలిపించినట్టు.. 45 సెకన్ల వీడియోలో 11 క్లిప్స్ జోడించడం విచిత్రంగా ఉంది. ICC ఛైర్మన్ అయినంత మాత్రాన.. బావుమా కన్నా జైషాకి అంత బిల్డప్ ఏంటంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బ్యాట్ పట్టడం కూడా చేతకాని జై షాకి అంత బిల్డప్ ఎందుకు..?
ఐసీసీ రిలీజ్ చేసిన WTC విన్నింగ్ వీడియోలో.. కెప్టెన్ బావుమా కంటే జై షా క్లిప్పులే ఎక్కువ!
సినిమాటిక్ లెవెల్‌లో జై షా క్లోజప్ షాట్స్ తీసి మరీ.. ఆ వీడియోలో తెగ ఇరికించేసిన ఐసీసీ
అతడేమైనా సౌతాఫ్రికా తరఫున క్రికెట్ ఆడాడా?… pic.twitter.com/Kc61DOU53S
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 17, 2025