Viral Video : విచిత్ర‌మైన ర‌నౌట్.. క్రికెట్ చ‌రిత్ర‌లో ఎవ‌రు ఇలా ర‌నౌట్ అయి ఉండ‌రు.. వీడియో మీకోసం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : విచిత్ర‌మైన ర‌నౌట్.. క్రికెట్ చ‌రిత్ర‌లో ఎవ‌రు ఇలా ర‌నౌట్ అయి ఉండ‌రు.. వీడియో మీకోసం..!

 Authored By ramu | The Telugu News | Updated on :30 January 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral Video : విచిత్ర‌మైన ర‌నౌట్.. క్రికెట్ చ‌రిత్ర‌లో ఎవ‌రు ఇలా ర‌నౌట్ అయి ఉండ‌రు.. వీడియో మీకోసం..!

Viral Video : క్రికెట్ చ‌రిత్ర‌లో కొన్ని సార్లు విచిత్ర‌మైన ఔట్స్ మ‌నం చూస్తూనే ఉంటాం. అనుకోని విధంగా ఔట్ కావ‌డం కొంత నిరాశ‌ని క‌లిగిస్తుంది.అయితే క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విచిత్రమైన అవుట్‌లలో ఒకటైన ఇంగ్లండ్ అండర్-19 బ్యాటర్ ఆర్యన్ సావంత్ ఒక‌టి. దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో అనూహ్య రీతిలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇంగ్లండ్ u-19 vs దక్షిణాఫ్రికా u-19 మధ్య స్టెల్లెన్‌బోష్ విశ్వవిద్యాలయంలో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్ యొక్క మూడవ రోజు, సావంత్ యొక్క స్వీప్ షాట్ అతనిని పెవిలియన్ పంపేలా చేసింది.

Viral Video విచిత్ర‌మైన ర‌నౌట్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఎవ‌రు ఇలా ర‌నౌట్ అయి ఉండ‌రు వీడియో మీకోసం

Viral Video : విచిత్ర‌మైన ర‌నౌట్.. క్రికెట్ చ‌రిత్ర‌లో ఎవ‌రు ఇలా ర‌నౌట్ అయి ఉండ‌రు.. వీడియో మీకోసం..!

Viral Video ఇదెక్క‌డి దుర‌దృష్టం..

ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ జేస‌న్ రౌల్స్ వేసిన బంతిని 19 ఏళ్ల ఆర్యన్ సావంత్ స్వీప్ షాట్ ఆడాడు. దాంతో ఆ బంతి షార్ట్-లెగ్ వద్ద ఉన్న ఫీల్డర్ వ‌ద్దకు వెళ్లి, అక్క‌డే ఫీల్డింగ్ చేస్తున్న జోరిచ్ వాన్ షాల్క్‌విక్ హెల్మెట్‌ను బ‌లంగా తాకి వెన‌క్కి వ‌చ్చి వికెట్ల‌ను గిరాటేసింది. ఇక షాట్ ఆడిన‌ తర్వాత బ్యాటర్ క్రీజ్ వెలుపల ఉండ‌డంతో ర‌నౌట్ అయ్యాడు. బంతి బ‌లంగా తాక‌డంతో జోరిచ్ విల‌విల్లాడాడు. ఇంగ్లండ్ అండ‌ర్‌-19, దక్షిణాఫ్రికా అండ‌ర్‌-19 మధ్య జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక జోరిచ్ వాన్ షాల్క్‌విక్ హెల్మెట్‌కు బంతి తగిలిన వెంటనే, అతను నేలపై పడిపోయాడు మరియు బంతి అతనికి బలంగా తగిలిందని గ్రహించిన వెంటనే సహచరులందరూ చుట్టుముట్టారు.

అయితే, ఆ తర్వాత ఫీల్డర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే షాట్ కొట్టే ప్ర‌య‌త్నంలో బ్యాలెన్స్ త‌ప్పి క్రీజ్ బ‌య‌ట‌కు వెళ్లాడు బ్యాట‌ర్. క్రీజ్‌లో లేని కార‌ణంగా బ్యాట‌ర్ ఔటైన‌ట్లు ప్ర‌క‌టించారు. ర‌నౌట్‌గా దాన్ని చిత్రీక‌రించారు. ఈ క్రమంలో ఇంగ్లిష్ అండర్ 19 జట్టు 30.4 ఓవర్లలో 106 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ప్ర‌స్తుతం క్రికెట‌ర్ ఔట్‌కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. వీడియోని చూసిన నెటిజన్స్ బ్యాడ్ ల‌క్ అంటే ఇదేనేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది