Virat Kohli : ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 17 చాలా రసవత్తరంగా సాగుతుంది. టాప్ టీమ్స్‌ని పరాజయాలు పలకరిస్తుండగా, సాదాసీదా అనుకున్న టీమ్స్ మాత్రం మంచి విజయాలు దక్కించుకుంటున్నాయి. గత రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య టఫ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 182 పరుగులు చేయగా, కోల్‌కతా నైట్ రైడర్స్ 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది. హోమ్ గ్రౌండ్‌లో ఆర్సీబీ ఓటమి చెందడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ జిడ్డు బ్యాటింగ్, ఆర్సీబీ బౌలర్స్ చెత్త ప్రదర్శన వల్లే ఓడిపోయిందని మండిపడుతున్నారు. అబ్బాయిల టీం కన్నా అమ్మాయిల టీమే బెటరంటున్నారు.
అయితే ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చాలా ఉన్నా కూడా ఎవరు పెద్దగా ప్రదర్శన కనబరచడం లేదు. తాజా మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కామెరూన్ గ్రీన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), గ్లేన్ మ్యాక్స్‌వెల్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) రాణించారు. ఇక కోల్‌కతాకు చెందిన ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్ దూకుడుగా ఆడి 6.3 ఓవర్లలో 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సునీల్ నరైన్ 22 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 47 పరుగులు చేయగా, ఫిలిప్ సాల్ట్ 20 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 50 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తన టీమ్‌ని గెలిపించాడు.
అయితే ఈ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉండే కోహ్లీ, గంభీర్ మ్యాచ్ మధ్యలో పరస్పరం హగ్ చేసుకొని మాట్లాడుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సమయంలో గంభీర్ గ్రౌండ్ లోకి వచ్చి కోహ్లీని హత్తుకోగా, కోహ్లీ నవ్వుతూ చాలా సరదాగా కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సునీల్ గవాస్కర్ అయితే వారిద్దరికి ఆస్కార్ ఇవ్వొచ్చు అని కూడా అన్నాడు. గత సీజన్‌లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్‌ల మధ్య వివాదం నెలకొనగా, ఇద్దరు కూడా చాలా సీరియస్‌గా మాట్లాడుకున్నారు. ఇప్పుడు కూడా అలా జరుగుతుందేమో అనుకున్నారు కాని వారిద్దరు కలిసి కనిపించి సందడి చేశారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.