Virat Kohli : హ‌మ్మ‌య్య గ‌త ఏడాది నిప్పు ఉప్పులా ఉన్న క్రికెట‌ర్స్ నిన్నటి మ్యాచ్‌లో క‌లిసిపోయారుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Virat Kohli : హ‌మ్మ‌య్య గ‌త ఏడాది నిప్పు ఉప్పులా ఉన్న క్రికెట‌ర్స్ నిన్నటి మ్యాచ్‌లో క‌లిసిపోయారుగా..!

Virat Kohli  : ప్ర‌స్తుతం ఐపీఎల్ సీజ‌న్ 17 చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. టాప్ టీమ్స్‌ని ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రిస్తుండ‌గా, సాదాసీదా అనుకున్న టీమ్స్ మాత్రం మంచి విజ‌యాలు ద‌క్కించుకుంటున్నాయి. గ‌త రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మ‌ధ్య ట‌ఫ్ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 182 పరుగులు చేయ‌గా, కోల్‌కతా నైట్ రైడర్స్ 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది. హోమ్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 March 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Virat Kohli : హ‌మ్మ‌య్య గ‌త ఏడాది నిప్పు ఉప్పులా ఉన్న క్రికెట‌ర్స్ నిన్నటి మ్యాచ్‌లో క‌లిసిపోయారుగా..!

Virat Kohli  : ప్ర‌స్తుతం ఐపీఎల్ సీజ‌న్ 17 చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. టాప్ టీమ్స్‌ని ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రిస్తుండ‌గా, సాదాసీదా అనుకున్న టీమ్స్ మాత్రం మంచి విజ‌యాలు ద‌క్కించుకుంటున్నాయి. గ‌త రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మ‌ధ్య ట‌ఫ్ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 182 పరుగులు చేయ‌గా, కోల్‌కతా నైట్ రైడర్స్ 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది. హోమ్ గ్రౌండ్‌లో ఆర్సీబీ ఓట‌మి చెంద‌డంపై ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కోహ్లీ జిడ్డు బ్యాటింగ్, ఆర్సీబీ బౌల‌ర్స్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న వ‌ల్లే ఓడిపోయింద‌ని మండిప‌డుతున్నారు. అబ్బాయిల టీం క‌న్నా అమ్మాయిల టీమే బెట‌రంటున్నారు.

అయితే ఆర్సీబీ బ్యాటింగ్ లైన‌ప్ చాలా ఉన్నా కూడా ఎవ‌రు పెద్ద‌గా ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌డం లేదు. తాజా మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కామెరూన్ గ్రీన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), గ్లేన్ మ్యాక్స్‌వెల్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) రాణించారు. ఇక కోల్‌కతాకు చెందిన ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్ దూకుడుగా ఆడి 6.3 ఓవర్లలో 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సునీల్ నరైన్ 22 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 47 పరుగులు చేయ‌గా, ఫిలిప్ సాల్ట్ 20 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 50 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఆడి త‌న టీమ్‌ని గెలిపించాడు.

అయితే ఈ మ్యాచ్‌లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉండే కోహ్లీ, గంభీర్ మ్యాచ్ మధ్యలో పరస్పరం హగ్ చేసుకొని మాట్లాడుకోవ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సమయంలో గంభీర్ గ్రౌండ్ లోకి వచ్చి కోహ్లీని హ‌త్తుకోగా, కోహ్లీ న‌వ్వుతూ చాలా స‌ర‌దాగా క‌నిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోపై పలువురు ప‌లు ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సునీల్ గ‌వాస్క‌ర్ అయితే వారిద్ద‌రికి ఆస్కార్ ఇవ్వొచ్చు అని కూడా అన్నాడు. గత సీజన్‌లో విరాట్‌ కోహ్లి, గౌతమ్‌ గంభీర్‌ల మధ్య వివాదం నెల‌కొన‌గా, ఇద్ద‌రు కూడా చాలా సీరియ‌స్‌గా మాట్లాడుకున్నారు. ఇప్పుడు కూడా అలా జ‌రుగుతుందేమో అనుకున్నారు కాని వారిద్ద‌రు క‌లిసి క‌నిపించి సంద‌డి చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది