Virat Kohli : కోహ్లీని విమర్శించినందుకు ఆ కామెంటేటర్‌ని చంపేస్తామని బెదిరింపులు..!
Virat Kohli : భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అనేక రికార్డులని కొల్లగొట్టడం మనం చూశాం. వన్డే, టెస్ట్‌లు, టీ20లు ఏదైన సరే కోహ్లీ తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఇటీవల జరిగిన ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అయితే, సీజన్ ఆరంభంలో కోహ్లీ ఎక్కువ దూకుడుగా కనబరచిన కోహ్లీ తర్వాత మాత్రం తన స్ట్రైక్ రేట్ మెరుగుపరచుకొని 154.70తో విమర్శలకు సమాధానాలు ఇచ్చాడు. విరాట్ కోహ్లీ తక్కువ స్ట్రైక్ రేట్‍తో ఆడుతున్నాడని, ఔట్ అవుతాననే భయంతో దూకుడు చూపడం లేదని ఐపీఎల్‍లో కామెంటేటర్‌గా ఉన్న న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ ఓ సందర్భంలో అన్నాడు.
Virat Kohli కోహ్లీతో పెట్టుకుంటే అంతే..
అయితే తర్వత తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు సైమన్ తెలియజేశాడు. అయితే కోహ్లీని విమర్శించిన సమయంలో తనను చంపేస్తానంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా బెదిరించారని క్రిక్‍బజ్ కార్యక్రమంలో సైమన్ డౌల్ వెల్లడించాడు. ఔట్ అవడం గురించి కోహ్లీ ఆలోచించకుండా దూకుడుగా ఆడాలనే తాను చెప్పానని ఆయన అన్నాడు. విరాట్ గురించి తాను నెగెటివ్‍గా మాట్లాడడం చాలా అరుదు అని తెలిపాడు. అలా మాట్లాడినందుకే సోషల్ మీడియాలో నన్ను బెదిరించారంటూ కామెంట్ చేశాడు సైమన్. నేను విరాట్ కోహ్లీ గురించి వెయ్యి గొప్ప విషయాలు చెప్పా. కానీ ఒకే అంశంలో ప్రతికూలంగా చెప్పడంతో హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఇది సిగ్గు చేటు” అని సైమన్ డౌల్ చెప్పాడు.

Virat Kohli : కోహ్లీని విమర్శించినందుకు ఆ కామెంటేటర్‌ని చంపేస్తామని బెదిరింపులు..!
విరాట్ కోహ్లీతో వ్యక్తిగతంగా తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని సైమన్ డౌల్ స్పష్టం చేశాడు. మ్యాచ్‍లు ముగిసిన తర్వాత చాలాసార్లు తాను, విరాట్ మాట్లాడుకున్నామని తెలిపాడు. ఇక ఆర్సీబీ ఐపీఎల్ నుండి నిష్క్రమించిన తర్వాత విరాట్ కోహ్లీ చిన్న గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే తన విరామం పొడిగించాలని కోహ్లి బీసీసీఐని అభ్యర్థించాడు. బీసీసీఐ కూడా విరాట్ నిర్ణయాన్ని గౌరవించి, కోహ్లీ అమెరికా వెళ్లే తేదీని పొడిగించినట్లు సమాచారం అందుతుంది.