Virat Kohli : తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టు దాదాపు ప్లే ఆఫ్స్‌కి దూరమైనట్టే. కేకేఆర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం కోసం చివరి వరకు పోరాడిన ఆర్సీబీ కేవలం ఒకే ఒక్క పరుగుతో ఓటమి చెందింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా, లాకీ ఫెర్గూసన్ చివరి బంతికి కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించగలిగాడు. దీంతో ఆర్సీబీకి వరుసగా పరాజయం ఎదురైంది. ఓవరాల్‌గా ఇది ఏడో పరాజయం కావడంతో ఆర్సీబీ దాదాపుగా ప్లే ఆఫ్ నుండి దూరమైనట్టే. ‘ఈ సాల కప్ నమ్దే’ అంటూ ఎదురుచూసిన ఆర్సీబీ అభిమానులు ప్రస్తుతం చాలా నిరాశలో ఉన్నారు. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఔట్ వివాదాస్పదంగా మారింది.
విరాట్ కోహ్లీ ఔటైన తీరుపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతుంది. కోహ్లీ సైతం అంపైర్ల నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ..డగౌట్‌లోనూ ఆగ్రహంగా కనిపించాడు. హర్షిత్ రాణా వేసిన మూడో ఓవర్‌లో విరాట్ కోహ్లీ(7 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 18) రిటర్న్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. హై ఫుల్‌టాస్‌గా వేసిన ఈ బంతి కోహ్లీ ఛాతి కంటే కొంచెం ఎత్తులోకి వచ్చింది. ఆ సమయంలో బాల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. అప్పుడు అంపైర్లు ఔట్ ఇవ్వగా.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకున్నాడు. అప్పుడు బంతి నడుము కన్నా ఎక్కువ ఎత్తులో వచ్చినట్టు స్పష్టంగా కనిపించింది. కాని బంతి డిప్ అయిందంటూ థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో సహనం కోల్పోయిన కోహ్లీ.. అంపైర్ల వద్దకు వచ్చి నిప్పులు చెరిగారు.
ఇక కోహ్లీ ఔట్‌పై పలువురు క్రికెటర్స్ కూడా స్పందిస్తున్నారు. భారత్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ అంబటి రాయుడు అంపైర్ల తీరును తప్పుబడుతూ… ఇది ముమ్మాటికి నాటౌట్ అని, అత్యంత చెత్త నిర్ణయమని అన్నాడు. నవ్‌జ్యోత్ సింగ్ సిద్దు సైతం అది క్లియర్ నోబాల్ అంటూ తన అభిప్రాయం తెలియజేశాడు. కొందరు అంపైర్స్ కూడా ఆ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చెత్త నిర్ణయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.