Virat Kohli : శివాలెత్తిపోయిన కోహ్లీ.. ఏకంగా అంపైర్‌తో అంత గొడ‌వ ఏసుకున్నాడేంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Virat Kohli : శివాలెత్తిపోయిన కోహ్లీ.. ఏకంగా అంపైర్‌తో అంత గొడ‌వ ఏసుకున్నాడేంటి?

 Authored By ramu | The Telugu News | Updated on :22 April 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Virat Kohli : శివాలెత్తిపోయిన కోహ్లీ.. ఏకంగా అంపైర్‌తో అంత గొడ‌వ ఏసుకున్నాడేంటి?

Virat Kohli  : త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓట‌మి పాలైంది. దీంతో ఆ జ‌ట్టు దాదాపు ప్లే ఆఫ్స్‌కి దూర‌మైన‌ట్టే. కేకేఆర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం కోసం చివరి వరకు పోరాడిన ఆర్సీబీ కేవ‌లం ఒకే ఒక్క ప‌రుగుతో ఓట‌మి చెందింది. చివ‌రి బంతికి మూడు ప‌రుగులు అవ‌స‌రం కాగా, లాకీ ఫెర్గూసన్ చివరి బంతికి కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించగలిగాడు. దీంతో ఆర్సీబీకి వ‌రుస‌గా ప‌రాజ‌యం ఎదురైంది. ఓవ‌రాల్‌గా ఇది ఏడో ప‌రాజ‌యం కావ‌డంతో ఆర్సీబీ దాదాపుగా ప్లే ఆఫ్ నుండి దూర‌మైన‌ట్టే. ‘ఈ సాల కప్ నమ్దే’ అంటూ ఎదురుచూసిన ఆర్సీబీ అభిమానులు ప్ర‌స్తుతం చాలా నిరాశ‌లో ఉన్నారు. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఔట్ వివాదాస్ప‌దంగా మారింది.

Virat Kohli  : కోహ్లీకి కోప‌మొచ్చింది..

విరాట్ కోహ్లీ ఔటైన తీరుపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతుంది. కోహ్లీ సైతం అంపైర్ల నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ..డగౌట్‌లోనూ ఆగ్రహంగా కనిపించాడు. హర్షిత్ రాణా వేసిన మూడో ఓవర్‌లో విరాట్ కోహ్లీ(7 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 18) రిటర్న్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. హై ఫుల్‌టాస్‌గా వేసిన ఈ బంతి కోహ్లీ ఛాతి కంటే కొంచెం ఎత్తులోకి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో బాల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. అప్పుడు అంపైర్లు ఔట్ ఇవ్వగా.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకున్నాడు. అప్పుడు బంతి న‌డుము క‌న్నా ఎక్కువ ఎత్తులో వ‌చ్చిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపించింది. కాని బంతి డిప్ అయిందంటూ థ‌ర్డ్ అంపైర్ ఔట్‌గా ప్ర‌క‌టించాడు. దీంతో సహనం కోల్పోయిన కోహ్లీ.. అంపైర్ల వద్దకు వచ్చి నిప్పులు చెరిగారు.

Virat Kohli శివాలెత్తిపోయిన కోహ్లీ ఏకంగా అంపైర్‌తో అంత గొడ‌వ ఏసుకున్నాడేంటి

Virat Kohli : శివాలెత్తిపోయిన కోహ్లీ.. ఏకంగా అంపైర్‌తో అంత గొడ‌వ ఏసుకున్నాడేంటి?

ఇక కోహ్లీ ఔట్‌పై పలువురు క్రికెట‌ర్స్ కూడా స్పందిస్తున్నారు. భార‌త్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ అంబటి రాయుడు అంపైర్ల తీరును తప్పుబ‌డుతూ… ఇది ముమ్మాటికి నాటౌట్‌ అని, అత్యంత చెత్త నిర్ణయమని అన్నాడు. నవ్‌జ్యోత్ సింగ్ సిద్దు సైతం అది క్లియర్ నోబాల్ అంటూ త‌న అభిప్రాయం తెలియ‌జేశాడు. కొంద‌రు అంపైర్స్ కూడా ఆ నిర్ణ‌యంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ చెత్త నిర్ణ‌యం అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది