Virat Kohli : విరాట్ కోహ్లీపై కుట్ర పన్నారా.. అందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా..!
Virat Kohli : రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్‌కి చేసిన సేవలు అన్ని ఇన్నీ కావు. భారత జట్టు సభ్యుడిగానే కాకుండా కెప్టెన్‌గాను ఆయన ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా అందుకోలేదనే అపవాదు తప్ప ఆయన సాధించిన ఘనతలు అనిర్వచనీయం. అయితే కోహ్లీ వెనక నడిచిన కుట్ర కారణంగా టీ20, వన్డే ఫార్మేట్ లకి కెప్టెన్ గా తప్పుకున్న కోహ్లీ.. తాజాగా టెస్ట్ లకి కూడా కెప్టెన్సీ వదులుకున్నాడనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా కోహ్లీకి బద్ధ శత్రువుగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తయారయ్యాడని టాక్స్ వినిపిస్తున్నాయి.
కోహ్లీకి టెస్ట్‌లలో అద్భుతమైన రికార్డ్ ఉన్న నేపథ్యంలో అతడిని ఇప్పట్లో టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుండి ఎవరు తప్పించలేరనే ప్రచారం నడిచింది. రోహిత్ కి ఫిట్నెస్ ప్రాబ్లెమ్, రాహుల్ కి అనుభవం లేకపోవడం, పంత్ ఇప్పుడిప్పుడే టీమ్ లో నిలదొక్కుకుంటూ ఉండటంతో టెస్ట్ లలో కోహ్లీ సారధ్యం మరికొన్ని ఏళ్ళు కొనసాగడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ.. ఇప్పుడు కోహ్లీ స్వయంగా టెస్ట్ కెప్టెన్సీ నుండి తప్పుకోవడం వెనుక బీసీసీఐ పెద్దల హస్తం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కి క్వాలిఫై అవ్వడం కష్టంగానే ఉంది.
Virat Kohli : కోహ్లీ తప్పుకోవడానికి కారణం ఎవరు?
దీనిని కూడా కోహ్లీ పై వేయడానికి బీసీసీఐ సిద్ధంగా ఉందని తెలుసుకున్న కోహ్లీ, ఆ అపవాదాన్ని మోయకుండానే, టెస్ట్ కెప్టెన్ గా కోహ్లీ తప్పుకున్నట్టు చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే కోహ్లీ నిర్ణయం తర్వాత ట్విటర్ వేదికగా స్పందించిన గంగూలీ… ‘‘విరాట్ నాయకత్వంలో భారత క్రికెట్ అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన కనబరిచింది. తన వ్యక్తిగత నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తోంది. జట్టులో తను కీలక సభ్యుడు. భవిష్యత్తులో టీమ్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో తన వంతు పాత్ర పోషిస్తాడనే భావిస్తున్నా. గొప్ప ఆటగాడు. వెల్‌డన్’’ అంటూ కోహ్లిని ప్రశంసించాడు.