virat kohli : పాపం కోహ్లీకి ఎలాంటి ప‌రిస్థితి వ‌చ్చింది..ఆయ‌న‌ను త‌ప్పించండి అంటూ అభిమానులు గ‌గ్గోలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

virat kohli : పాపం కోహ్లీకి ఎలాంటి ప‌రిస్థితి వ‌చ్చింది..ఆయ‌న‌ను త‌ప్పించండి అంటూ అభిమానులు గ‌గ్గోలు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :18 July 2022,6:30 pm

virat kohli : గ‌త కొద్ది రోజులుగా కోహ్లీని నెటిజ‌న్స్ ఉతికి ఆరేస్తున్నారు. ఆయ‌న‌పై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా కూడా కోహ్లీ ఆట‌తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 259 పరుగులకి ఆలౌటవగా.. లక్ష్యఛేదనలో భారత్ జట్టు మూడో ఓవర్‌లోనే శిఖర్ ధావన్ (1) వికెట్ చేజార్చుకుంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (17: 22 బంతుల్లో 3×4) మూడు బౌండరీలు కొట్టినా.. మరోసారి తన పాత పద్ధతిలో పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో.. నువ్వు తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

virat kohli career in critical situation

virat kohli gets trolling by fans

virat kohli : కోహ్లీపై ఆగ్ర‌హావేశాలు..

మొన్న‌టి వ‌ర‌కు నెటిజ‌న్స్ మాత్ర‌మే కోహ్లీపై మాట‌ల దాడి చేసేవారు. కాని ఇప్పుడు అభిమానులు కొంద‌రు కోహ్లీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ్యాచ్ గెలిచింది కాబ‌ట్టి కొంతలో కొంత సేఫ్ అయ్యావు. లేదంటే దారుణ ప‌రిస్థితుల‌ని ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చేద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ పేలవ ఫామ్ నేపథ్యంలో అత‌నిపై అనేక సెటైర్స్ పేలుతున్నాయి. గత మూడేళ్లగా విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో ఒక్క సెంచరీ కూడా చేయని మాట నిజం. కానీ మూడు ఫార్మాట్లలో కలిపి అతను 24 హాఫ్ సెంచరీలు చేశాడనేది కూడా అంతే వాస్తవం. భారత జట్టులో మరే బ్యాటర్ కూడా కోహ్లీ కంటే మెరుగ్గా ప్రదర్శన చేయలేదు.

అయినా కోహ్లీలో ఫామ్‌లో లేడు. అతన్ని జట్టు నుంచి తప్పించాలి. గత వారం రోజులుగా వినిపిస్తున్న విమర్శలు. స్థాయికి తగ్గ ప్రదర్శనలా అనిపించడం లేదు. ఆ క్రమంలోనే విరాట్‌పై నోరుపారేసుకుంటున్నారు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై చివరి సెంచరీ బాదిన విరాట్ ఆ తర్వాత మొత్తం 24 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇందులో 85 పరుగులకు పైగా 6 సార్లు చేశాడు. వెస్టిండీస్‌తో 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ 24 హాఫ్ సెంచరీలకు సంబంధించిన వీడియోలను రతన్ దీప్ అనే ట్విటర్ యూజర్ పంచుకున్నాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది