Virat Kohli : కోహ్లీకి, సఫారీ కెప్టెన్ మధ్య జరిగిన గొడవ.. ఎందుకలా చేస్తున్నావంటూ ఆగ్రహం…?
Virat Kohli : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫైర్ ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. అన్ని ఫార్మాట్స్ నుండి కెప్టెన్‌గా తప్పుకున్నప్పటికీ తనదైన దూకుడుతో ముందుకు సాగుతున్నారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య బొలాండ్ పార్క్ వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ, తెంబ బవుమా మధ్య గొడవ జరిగింది. ఐదేళ్ల తర్వాత తొలిసారి వేరొకరి కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ ఆడుతుండగా.. దక్షిణాఫ్రికా జట్టుని కెప్టెన్‌గా తెంబ బవుమా నడిపిస్తున్నాడు. మ్యాచ్‌లో […]
Virat Kohli : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫైర్ ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. అన్ని ఫార్మాట్స్ నుండి కెప్టెన్‌గా తప్పుకున్నప్పటికీ తనదైన దూకుడుతో ముందుకు సాగుతున్నారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య బొలాండ్ పార్క్ వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ, తెంబ బవుమా మధ్య గొడవ జరిగింది. ఐదేళ్ల తర్వాత తొలిసారి వేరొకరి కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ ఆడుతుండగా.. దక్షిణాఫ్రికా జట్టుని కెప్టెన్‌గా తెంబ బవుమా నడిపిస్తున్నాడు. మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 18వ ఓవర్ నుంచి దుస్సేన్‌కి చక్కటి సహకారం అందించిన తెంబ బవుమా ఎక్కువగా సింగిల్స్‌పై ఫోకస్ పెట్టాడు.
మైదానంలో చురుగ్గా కదల్లేకపోయిన అశ్విన్ చాలా సింగిల్స్ అక్కడ సమర్పించుకున్నాడు. దాంతో.. అశ్విన్‌ని అక్కడి నుంచి డీప్ ఫైన్‌లెగ్‌కి మార్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్.. మిడాన్‌లో విరాట్ కోహ్లీని ఫీల్డింగ్‌కి ఉంచాడు.దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 36వ ఓవర్ నాలుగో బంతిని కెప్టెన్ బవుమా షార్ట్ కవర్ రీజియన్ దిశగా ఆడాడు. అది నేరుగా కోహ్లి చేతుల్లోకి వెళ్లింది. అయితే పంత్ వైపు వేసే ఉద్దేశంతో కోహ్లి బంతిని బలంగా విసిరాడు. పొరపాటున బంతి బవుమాకు తగిలినప్పటికి పెద్దగా గాయం కాలేదు.
Virat Kohli : బవుమా, కోహ్లీ డిష్యూం డిష్యూం
కాని బవుమా కోహ్లివైపు కోపంగా చూస్తూ.. ”నేను క్రీజులోనే ఉన్నా అలాంటి త్రోలు వేయనవసరం లేదు” అంటూ పేర్కొన్నాడు. దీంతో కోపం పట్టలేకపోయిన మెషిన్‌గన్ బవుమాతో.. ”నేనేం కావాలని నిన్ను కొట్టాలనుకోలేదు.. వికెట్ కీపర్‌కు త్రో వేసే క్రమంలో పొరపాటున తగిలిఉంటుంది.. ఒక బ్యాట్స్‌మన్‌గా ఇది నువ్వు అర్థం చేసుకోవాలి” అంటూ ధీటుగా బదులిచ్చాడు. బవుమాకు రిప్లై ఇచ్చిన తర్వాత కోహ్లి.. అసహనంగా ఉండటం వీడియోలో చూడచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.