Virat Kohli : టీమిండియా Team India సీనియర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని Virat Kohli ఒకప్పుడు పరుగుల రారాజుగా పిలిచేవారు. ఆయన ఇప్పుడు పేలవ ఫామ్‌లో ఉన్నాడు. అతడి బ్యాటింగ్‌లో కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. మునుపటి ఉత్సాహం, విశ్వాసం లోపిస్తున్నాయి. అందుకే తన బలమైన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ షాట్ ఆడి వరుసగా 8 సార్లు ఔట్ అవ్వడం మనం చూశాం.. అయితే వైఫల్యాల నుంచి బయటపడాలని భావిస్తున్న విరాట్.. అందుకు దేశవాళీల బాట పట్టాలని భావించాడు. రంజీ ట్రోఫీ మ్యాచులతో తిరిగి ఫామ్‌ను అందుకోవాలని అనుకున్నాడు. అందుకు తగ్గట్లే ఢిల్లీ జట్టుతో కలసి ప్రాక్టీస్ కూడా ఆరంభించాడు. అయితే హఠాత్తుగా రంజీలకు అతడు దూరమనే వార్త బయటకు వచ్చింది.
Virat Kohli కారణం ఏంటి?
విరాట్ కోహ్లీకి ఆరోగ్యం బాగాలేదని.. మెడ నరం పట్టేసిందని.. అందువల్లే అతడు రంజి క్రికెట్ ఆడడం లేదని తెలుస్తోంది.. మెడనొప్పిని తగ్గించుకోవడానికి అతడు ఇంజక్షన్లు వాడుతున్నాడని.. అందువల్లే అతడు ఫైనల్ లో ప్లే -11 లో ఆడటం కష్టమని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.. విరాట్ కోహ్లీ గాయానికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలతో పాటు యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ Rishabh Pant, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు జనవరి 23 నుంచి ప్రారంభం కానున్న రంజీట్రోఫీ బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే.. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు మాత్రం రంజీ మ్యాచ్ ఆడడం లేదని వార్తలు వస్తున్నాయి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పుడే కోహ్లీ మెడ పట్టేసిందని, దానికి అతడు ఇంజెక్షన్లు కూడా వాడుతున్నాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంగ్లాండ్‌తో వన్డే, ఛాంపియన్స్ ట్రోఫీ Champions Trophy నేపథ్యంలో తాను కోలుకునేందుకు సమయం కావాలని, ఈ క్రమంలోనే రంజీ మ్యాచ్ ఆడలేనని కోహ్లీ బీసీసీఐకి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక విరాట్ కోహ్లీ ఆడే విషయంలో ఉత్కంఠ తొలగిపోకపోవడంతో అతడి స్థానంలో జనవరి 23న సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్లో ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తాడని తెలుస్తోంది. అయితే తనకు కెప్టెన్సీ వద్దని రిషబ్ మొహమాటం లేకుండా చెప్పినట్టు సమాచారం.. అయితే కెప్టెన్సీ బాధ్యతలను ఆయుష్ బదోనికి అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే విరాట్ చివరి క్షణంలో రంజీల నుంచి వైదొలగడానికి గాయమే కారణమా? లేదా అతడ్ని ఎవరైనా ఆపేశారా? అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.
Keerthy Suresh : పెళ్ళైన కేక పెట్టిస్తున్న కీర్తి సురేష్ ఫోటోస్ వైరల్..! Keerthy Suresh : పెళ్ళైన కేక…
Child Artist Revanth: రేవంత్ భీమల ... తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో ఈ బుడ్డోడు చేస్తున్న హంగామా మాములుగా లేదు.…
WhatsApp New Features : ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన WhatsApp వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం…
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా Global star పేరు ప్రఖ్యాతలు…
Nagababu : ప్రముఖ సినీ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు Nagababu మంత్రి అయినట్లేనని అంతా అంటున్నారు. రానున్న మార్చి…
PVC Aadhaar Card : నేటి ప్రపంచంలో ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. మీరు బ్యాంకింగ్, ఆస్తి…
Local Body Elections : తెలంగాణలో Telangana వరుస ఎన్నికల సమరానికి సీఎం రేవంత్ Revanth reddy రంగాన్ని సిద్ధం…
Chiranjeevi : ఇటీవల సోషల్ మీడియాలో పాజిటివిటీ కన్నా నెగెటివిటీ ఎక్కువగా ఉంది. మొత్తం నెగిటివిటినే. సినిమా నచ్చకపోతే చెప్పండి…
This website uses cookies.