Virat kohli : ఇక మారవా కోహ్లీ.. ఆడింది చాలు.. గౌరవంగా తప్పుకుంటే మంచిది..!
ప్రధానాంశాలు:
Virat kohli : ఇక మారవా కోహ్లీ.. ఆడింది చాలు.. గౌరవంగా తప్పుకుంటే మంచిది..!
Virat kohli : టీమిండియా తీరు మారడం లేదు.రెండో టెస్ట్‌లో దారుణంగా ఓడిన ఇండియా గబ్బా వేదికగా జరగుతున్న మూడో టెస్టులో (గబ్బా) ఆస్ట్రేలియా బౌలర్ల దెబ్బకు కుదేలవుతుంది.టీమ్ ఇండియా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు చేరుతున్నారు. 22 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (4; 2 బంతుల్లో, 1 ఫోర్), శుభ్‌మన్ గిల్ (1; 3 బంతుల్లో)ను మిచెల్ స్టార్క్ పెవిలియన్‌కు పంపాడు. విరాట్ కోహ్లీని (3; 16 బంతుల్లో)ని హేజిల్‌వుడ్ బోల్తా కొట్టించాడు. అయితే విరాట్ ఔట్ అవ్వడంపై క్రికెట్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ వేసిన విచిత్రమైన బంతి కోహ్లి బ్యాట్ అంచును తాకి వికెట్ కీపర్ అలెక్స్ కారీ చేతికి చేరింది.
Virat kohli రిటైర్మెంట్ తీసుకో..
కోహ్లి కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ ఔట్ కోహ్లి అభిమానులకు మరోసారి నిరాశ కలిగించగా, ట్రోలింగ్ లు తారాస్థాయికి చేరాయి. అతను దాదాపు ప్రతీసారి అదే తప్పును పునరావృతం చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ తరహాలో విరాట్ ఔటవ్వడం సాధారణంగా మారిపోయింది. ఈ సిరీస్‌లోనే డ్రైవ్‌కు ప్రయత్నించి వికెట్ కీపర్-స్లిప్‌లలో మూడోసారి ఔట్ అయ్యాడు. పదే పదే ఒకే తప్పు చేస్తూ వికెట్ పారేసుకోవడం చర్చలకు దారితీసింది. విరాట్.. నువ్వు ఇక మారవా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీస్‌తో షాట్లు కొట్టు చూద్దామంటూ కోహ్లీని టెంప్ట్ చేశాడు హేజల్‌వుడ్. అలాంటి బంతులకు కవర్ డ్రైవ్స్‌తో ఎన్నోమార్లు భారీగా పరుగులు రాబట్టాడు కింగ్.
ఆసీస్ వలలో పడిన కోహ్లీ.. వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతుల్ని తనదైన స్టైల్‌లో ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ షాట్ కనెక్ట్ అవలేదు. బంతి అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. కావాలనే కోహ్లీని రెచ్చగొట్టి ఔట్ చేశాడు హేజల్‌వుడ్. విరాట్ మరింత ఓపికగా, కూల్‌గా ఆడి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి .టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదనే వాదన మొదలైంది. కోహ్లీ గత చివరి 14 ఇన్నింగ్స్ లను పరిశీలిస్తే ఒక సంచరీ.. ఒక అర్ధ సెంచరీ మాత్రమే ఉంది. అతడి చివరి 15 ఇన్నింగ్స్ ల్లో అతడి ప్రదర్శన చూస్తూ.. 6, 17, 47, 29 నాటౌట్, 0, 70, 1, 17, 4, 1, 5, 100 నాటౌట్, 7, 11, 3. 15 ఇన్నింగ్స్ ల్లో 318 పరుగులు చేశాడు. సగటు కేవలం 24.46. ఈ సగటు చూసి చాల మంది కోహ్లీని రిటైర్ అవ్వమని కోరుతున్నారు. virat kohli falls again to the off stump trap social media explodes ,