Virat Kohli : రంజీలలో ఆడేందుకు విరాట్ ఆస‌క్తి చూపాడా… లేదంటే ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నాడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Virat Kohli : రంజీలలో ఆడేందుకు విరాట్ ఆస‌క్తి చూపాడా… లేదంటే ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నాడా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :18 January 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Virat Kohli : రంజీలలో ఆడేందుకు విరాట్ ఆస‌క్తి చూపాడా... లేదంటే ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నాడా..!

Virat Kohli : టీమిండియా Team India సీనియర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని Virat Kohli ఒక‌ప్పుడు ప‌రుగుల రారాజుగా పిలిచేవారు. ఆయ‌న ఇప్పుడు పేలవ ఫామ్‌లో ఉన్నాడు. అతడి బ్యాటింగ్‌లో కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. మునుపటి ఉత్సాహం, విశ్వాసం లోపిస్తున్నాయి. అందుకే తన బలమైన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ షాట్ ఆడి వరుసగా 8 సార్లు ఔట్ అవ్వ‌డం మ‌నం చూశాం.. అయితే వైఫల్యాల నుంచి బయటపడాలని భావిస్తున్న విరాట్.. అందుకు దేశవాళీల బాట పట్టాలని భావించాడు. రంజీ ట్రోఫీ మ్యాచులతో తిరిగి ఫామ్‌ను అందుకోవాలని అనుకున్నాడు. అందుకు తగ్గట్లే ఢిల్లీ జట్టుతో కలసి ప్రాక్టీస్ కూడా ఆరంభించాడు. అయితే హఠాత్తుగా రంజీలకు అతడు దూరమనే వార్త బయటకు వచ్చింది.

Virat Kohli రంజీలలో ఆడేందుకు విరాట్ ఆస‌క్తి చూపాడా లేదంటే ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నాడా

Virat Kohli : రంజీలలో ఆడేందుకు విరాట్ ఆస‌క్తి చూపాడా… లేదంటే ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నాడా..!

Virat Kohli కార‌ణం ఏంటి?

విరాట్ కోహ్లీకి ఆరోగ్యం బాగాలేదని.. మెడ నరం పట్టేసిందని.. అందువల్లే అతడు రంజి క్రికెట్ ఆడ‌డం లేదని తెలుస్తోంది.. మెడనొప్పిని తగ్గించుకోవడానికి అతడు ఇంజక్షన్లు వాడుతున్నాడని.. అందువల్లే అతడు ఫైనల్ లో ప్లే -11 లో ఆడటం కష్టమని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.. విరాట్ కోహ్లీ గాయానికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, ర‌వీంద్ర జ‌డేజాల‌తో పాటు యువ ఆట‌గాళ్లు య‌శ‌స్వి జైస్వాల్‌, రిష‌బ్ పంత్ Rishabh Pant, శుభ్‌మ‌న్ గిల్ వంటి ఆట‌గాళ్లు జ‌న‌వ‌రి 23 నుంచి ప్రారంభం కానున్న రంజీట్రోఫీ బ‌రిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే.. స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు మాత్రం రంజీ మ్యాచ్ ఆడ‌డం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ చివ‌రి టెస్టు మ్యాచ్ ఆడుతున్న‌ప్పుడే కోహ్లీ మెడ ప‌ట్టేసింద‌ని, దానికి అత‌డు ఇంజెక్ష‌న్లు కూడా వాడుతున్నాడ‌ని క్రికెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇంగ్లాండ్‌తో వ‌న్డే, ఛాంపియ‌న్స్ ట్రోఫీ Champions Trophy నేప‌థ్యంలో తాను కోలుకునేందుకు స‌మ‌యం కావాల‌ని, ఈ క్ర‌మంలోనే రంజీ మ్యాచ్ ఆడ‌లేన‌ని కోహ్లీ బీసీసీఐకి చెప్పిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక‌ విరాట్ కోహ్లీ ఆడే విషయంలో ఉత్కంఠ తొలగిపోకపోవడంతో అతడి స్థానంలో జనవరి 23న సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్లో ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తాడని తెలుస్తోంది. అయితే తనకు కెప్టెన్సీ వద్దని రిషబ్ మొహమాటం లేకుండా చెప్పినట్టు సమాచారం.. అయితే కెప్టెన్సీ బాధ్యతలను ఆయుష్ బదోనికి అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే విరాట్ చివరి క్షణంలో రంజీల నుంచి వైదొలగడానికి గాయమే కారణమా? లేదా అతడ్ని ఎవరైనా ఆపేశారా? అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది