Virat Kohli : కోహ్లీ లేకుండానే భారత్ టీ20 ప్రపంచ కప్ ఆడనుందా.. అసలు నిజం ఏంటి..?
ప్రధానాంశాలు:
Virat Kohli : కోహ్లీ లేకుండానే భారత్ టీ20 ప్రపంచ కప్ ఆడనుందా.. అసలు నిజం ఏంటి..?
Virat Kohli : భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సచిన్ తర్వాత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా కొనియాడుతున్నకోహ్లీ ఇటీవల క్రికెట్‌కి కాస్త దూరంగా ఉంటున్నాడు. తనకు రెండో సంతానం కలిగిన నేపథ్యంలో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కి పూర్తి దూరంగా ఉన్నాడు. ఇక మార్చి 22వ తేదీ నుంచి జరగనున్న ఐపీఎల్ 2024 కోసం ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఐపీఎల్ తర్వాత ఈ ఏడాది జూన్‍లో టీ20 ప్రపంచకప్ జరగనుండగా, ఈ ట్రోఫీలో కోహ్లీ భాగం అవుతాడని మొన్నటి వరకు అంతా అనుకున్నారు.. కాని ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తలు చూసి కోహ్లీ ఫ్యాన్స్ షాకయ్యారు.
టీ20ల్లో యువ ఆటగాళ్లు చాలా మంది దుమ్ము రేపుతున్న నేపథ్యంలో కోహ్లీని టీ20 ప్రపంచకప్‌కి సెలక్ట్ చేసే ఆలోచనలో సెలక్టర్స్ లేరని ఓ రిపోర్ట్ తెలియజేసింది. కోహ్లీ ప్రస్తుతం టీ20కి తగ్గట్లు ఆడడం లేదని అందుకే ఆయనని పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఐపీఎల్‌లో కోహ్లీ దూకుడిగా ఆడి అదరగొడితే ఆయనని సెలక్ట్ చేసే ఛాన్స్ ఉంది. లేదంటే పక్కా పక్కన పెట్టేస్తారనే టాక్ వినిపిస్తుంది. అయితే పొట్టి ప్రపంచ కప్ టోర్నీ కోసం ప్రొవిజనల్ జట్టును మే నెలలో ఐసీసీకి, బీసీసీఐ పంపాల్సి ఉండగా ఆ సమయంలో మాత్రమే విరాట్ కోహ్లీ స్థానంపై ఓ క్లారిటీ వస్తుంది. ఇక టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ జూన్ 2వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు జరగనున్న విషయం మనకు తెలిసిందే. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీలు ఇద్దరూ 14 నెలలుగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకి పూర్తిగా దూరంగా ఉండి, ఇటీవల జరిగిన అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కి మాత్రం ఆడారు. ఈ సిరీస్‌లో విరాట్ కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే ఆడగా, ఒక మ్యాచ్‌లో 29 పరుగులు చేసి మరో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.అదే సమయంలో యశస్వి జైస్వాల్, శివమ్ దూబె, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు అదరగొట్టారు.
మరోవైపు టీ20 స్పెషలిస్ట్ సూర్య కుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా జట్టులో చేరతారు. ఇప్పుడు ఇంత మంది ఆటగాళ్లలో ఎవరిని సెలక్ట్ చేయాలనేది ఇప్పుడు సెలక్టర్స్‌కి పెద్ద తలనొప్పిగా మారింది. అయితే సెలక్టర్లు విరాట్ కోహ్లీని ప్రపంచకప్‌కు పరిగణనలోకి తీసుకోకపోవడం కష్టతరమైన నిర్ణయమే అయనప్పటికీ వేరే ఆప్షన్ లేదు కాబట్టి బీసీసీఐ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని అగార్కర్ చేత కోహ్లీకి చెప్పిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఒక వేళ కోహ్లీ ఆడని పక్షంలో ఆయన స్థానంలో సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, తిలక్ వర్మ, రింకూ సింగ్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. మరి కొద్ది రోజులలో కోహ్లీ స్థానంపై ఓ క్లారిటీ రానుంది.