Kohli Rohit : టీమిండియాలో కోల్ట్ వార్.. మ్యాచ్‌లకు వారిద్దరూ దూరం
Kohli-Rohit : టీమిండియాలో కెప్టెన్సీ కొత్త వివాదానికి కారణమవుతోంది. రెండు సంవ్సతరాలుగా రోహిత్, కొహ్లీ మధ్య కోల్డ్ వారు నడుస్తున్న విషయం తెలిసింది. ప్రస్తుతం కెప్టెన్సీ అంశం అందుకు ఆజ్యం పోసినట్టయింది. వారం క్రితం కెప్టెన్సీ విభజనతో ఇండియన్ సెలక్టర్స్ ఇందుకు బీజం వేశారు. ప్రస్తుతం ఇది తారాస్థాయికి చేరకుంది. దక్షిణాఫ్రికా పర్యటను ఈ వారం టీమిండియా వెళ్లనుంది. ఈనెల 26 నుంచి మూడు టెస్టుల సిరీస్.. జనవరి 19 నుంచి మూడు వన్టేల సిరీస్ ఆడేందుకు రెడీ అవుతోంది.
ఇందులో టెస్టు సిరీస్‌కు కెప్టెన్ గా కోహ్లీ, వన్డే సిరీస్‌కు కెప్టెన్ గా రోహిత్ వ్యవహరిస్తారని సెలక్టర్స్ డిసైడ్ చేశారు. దీంతో ఆ సిరీస్ లపై ఆసక్తి పెరిగింది. కానీ రోహిత్, కోహ్లీ ఊహించని నిర్ణయం తీసుకున్నారు.ముంబయిలోని ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన రోహిత్.. టెస్టు సిరీస్‌కు దూరంగా ఉంటున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. జనవరి 11న కోహ్లీ కూతురు పుట్టిన రోజు కావడంతో కోహ్లీ సైతం వన్డే సిరీస్‌కు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. కెప్టెన్సీ నుంచి తొలగించడంతోనే కోహ్లీ ఇలా మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడని టాక్.

virat kohli rohit sharma away for matches
Kohli Rohit : టెస్టు సిరీస్‌కు రోహిత్, వన్డే సిరీస్ కు కోహ్లీ దూరం
వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని సెలక్టర్లు కోహ్లీకి సూచించిన అనంతరం రెండు రోజులకు కూడా కోహ్లీ స్పందించలేదు. దీంతో ఆయనపై వేటు పడినట్టు వార్తలొచ్చాయి. దీంతో క్రికెట్ అభిమానులు మాత్రం చాలా తీవ్రంగా స్పందించారు. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని తట్టుకోలేకపోయారు. సెలక్టర్లపై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖులు సైతం దీనిపై స్పందించడం గమనార్హం. మరి వీరిద్దరి మధ్య నడుస్తున్న కోల్ట్ వార్ ఎప్పటికి చల్లారుతుందో చూడాలి. భవిష్యత్తులో వీరిద్దరు కలిసి మ్యాచ్ ఆడాలని వారి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.