Virat Kohli : విరాట్ కోహ్లీ తీరు మారదా, విసిగిపోతున్న అభిమానులు.. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్
Virat Kohli : ఒకప్పుడు పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ గత కొద్ది రోజులుగా విఫలం అవుతున్నారు. సెంచరీ చేసి రెండేళ్లు అవుతోంది. 2019లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఇంటర్నేషనల్ సెంచరీ చేశాడు కోహ్లీ. ఇక అప్పటినుంచి పేలవమైనఫామ్ తో సతమతమవుతున్నాడు. చివరికి వరుసగా మూడు గోల్డెన్ డక్ ల చెత్త రికార్డు కూడా మూటగట్టుకున్నాడు. కోహ్లీ ఆటను చూసిన రవిశాస్త్రి లాంటి సీనియర్లు అతనిని బ్రేక్ తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే తాజా టెస్ట్‌లో అయిన విరాట్ కోహ్లీ రాణించి విమర్శలకు చెక్ పెడతాడేమోనని అందరు భావించారు. కాని మళ్లీ చెత్తఆటతో నిరాశపరిచాడు.
తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే వెనుదిరిగిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్ చెత్త ఫామ్‌పై అభిమానులే కాక మాజీలు కూడా మండిపడుతున్నారు. మరో రెండు మూడు మ్యాచ్‌లు చూసి ఆటతీరు మారకపోతే తీసి పక్కన పెట్టడం బెటర్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టెస్టులో విరాట్ కోహ్లీ ఫీల్డ్‌లో యానిమేటెడ్ కోణాన్ని చూపించాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోని సెడ్జ్ చేసిన విరాట్ కోహ్లీ, అతను సెంచరీ చేసిన తర్వాత చప్పట్లతో అభినందించాడు…జానీ బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ని అందుకున్న విరాట్ కోహ్లీ, ఫ్లైయింగ్ కిస్‌తో సెంచరీ హీరోని పెవిలియన్‌కి సాగనంపాడు.

Virat Kohli trolled by netigens
Virat Kohli : పాపం.. కోహ్లీ
అంతకుముందు ఆట రెండో రోజున జో రూట్ అవుటైన తర్వాత విరాట్ కోహ్లీ ఆ వికెట్‌ని డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సమయంలో హిందీ కామెంటరీ బాక్సులో ఉన్న భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్… ‘ఛమీయా నాచ్ రహీ హూ’ (ఛమీయా డ్యాన్స్ చేస్తోంది) అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఛమీయా అనే పదాన్ని హిజ్రా అనే అర్థం వచ్చేలా వాడతారు. దీంతో భారత జట్టుకి అత్యధిక టెస్టు విజయాలు అందించి, అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన క్రికెటర్‌ని ఇలాంటి వ్యాఖ్యలతో సంభోదించడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు