Test Matches : మూడే రోజులు.. ఎందుకు టెస్ట్ మ్యాచ్ లు మూడు రోజుల్లోనే ముగుస్తున్నాయి?
Test Matches : క్రికెట్ లో అసలైన మజా ఎక్కడ వస్తుందో తెలుసా? టెస్ట్ మ్యాచ్ ద్వారానే వస్తుంది. ఎందుకంటే.. రోజుల తరబడి టెస్ట్ మ్యాచ్ లు ఆడుతూనే ఉంటారు. ఈ మధ్య 20 20 క్రికెట్ టోర్నమెంట్లు వచ్చాయి. అవి అయితే మ్యాచ్ చూసినట్టే అనిపించదు. వన్డే కంటే కూడా టెస్ట్ మ్యాచ్ అంటేనే అసలైన క్రికెట్. ప్లేయర్ల సత్తాను చాటేది అదే. కానీ.. ఇప్పుడు రోజులు మారాయి. టెస్ట్ మ్యాచ్ లు కూడా తగ్గిపోయాయి. […]
Test Matches : క్రికెట్ లో అసలైన మజా ఎక్కడ వస్తుందో తెలుసా? టెస్ట్ మ్యాచ్ ద్వారానే వస్తుంది. ఎందుకంటే.. రోజుల తరబడి టెస్ట్ మ్యాచ్ లు ఆడుతూనే ఉంటారు. ఈ మధ్య 20 20 క్రికెట్ టోర్నమెంట్లు వచ్చాయి. అవి అయితే మ్యాచ్ చూసినట్టే అనిపించదు. వన్డే కంటే కూడా టెస్ట్ మ్యాచ్ అంటేనే అసలైన క్రికెట్. ప్లేయర్ల సత్తాను చాటేది అదే. కానీ.. ఇప్పుడు రోజులు మారాయి. టెస్ట్ మ్యాచ్ లు కూడా తగ్గిపోయాయి. టెస్ట్ మ్యాచ్ లలో పస తగ్గిపోయింది. ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ లలో ఆసక్తి కరవవుతోంది.
ఎందుకు టెస్ట్ మ్యాచ్ లపై ఆసక్తి తగ్గుతోంది అంటే దానికి కారణం టీ20 మ్యాచ్ లు. టీ20 క్రికెట్ కు జనాలు అలవాటు పడ్డారు. ఆ మ్యాచ్ లకు అలవాటు పడి.. టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లు బోర్ కొట్టేస్తున్నాయి. టెస్టు క్రికెట్ చూడాలంటే.. రోజుల తరబడి వెయిట్ చేయాలి. అసలే.. ఈరోజుల్లో జనాలు ఫుల్ బిజీ కదా. టెస్ట్ క్రికెట్ చూసేంత సమయం ఎక్కడిది. నిజానికి మ్యాచ్ చూసే ప్రేక్షకుడికే కాదు.. మ్యాచ్ ఆడే ఆటగాళ్లకు కూడా టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు ముగించేయాలా అన్నట్టుగా ఉందట. అందుకే.. మూడు రోజుల్లోనే ఈ మధ్య టెస్ట్ మ్యాచ్ లు ముగిసిపోతున్నాయి.
Test Matches : టెస్ట్ మ్యాచ్ లు ఆడే ఓపిక కూడా ప్లేయర్లకు తగ్గిందా?
ఐదు రోజులు ఆడే సత్తా ఇప్పుడు టెస్ట్ క్రికెటర్లకు కూడా లేదు. ఇప్పుడు ఒక రోజు, రోజున్నరలోనే మ్యాచ్ ముగిసిపోతోంది. అంతే.. రెండు ఇన్నింగ్స్ పూర్తయ్యే సరికి.. వెంటనే మూడు రోజుల్లోనే ఎవరు గెలుస్తున్నారో తెలిసిపోతుంది. ఒకప్పుడు క్రికెటర్లు ఇవే పిచ్ ల మీద రోజులకు రోజులు టెస్ట్ మ్యాచ్ లు ఆడుతుంటే స్టేడియంలో, టీవీల ముందు గంటల తరబడి ప్రేక్షకులు అలాగే కూర్చొని మ్యాచ్ ను ఎంజాయ్ చేసేవాళ్లు. ఇప్పుడు ఆరోజులు ఎక్కడివి. 20 ఓవర్ల మ్యాచ్ చూసేందుకే అబ్బా.. ఇంకెప్పుడు మ్యాచ్ అయిపోతుంది అని ఊసురుమనే ప్రేక్షకులు తయారయ్యారు.