Motorola : మోటోరోలా స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వారికి శుభవార్త… ఎందుకంటే…
Motorola : కొత్తగా వచ్చిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 13 రోల్ అవుట్ మొదలైంది. ఇప్పటికే పిక్సెల్ స్మార్ట్ ఫోన్ లకు గూగుల్ ఈ అప్డేట్ ను రిలీజ్ చేసింది. మిగిలిన కంపెనీలు కూడా ఆండ్రాయిడ్ 13 అప్డేట్ కు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో పాపులర్ బ్రాండ్ మోటోరోలా ప్రకటన చేసింది. తొలి దశలో ఆండ్రాయిడ్ 13 అప్డేట్ అందుకున్న మొబైల్స్ లిస్టును విడుదల చేసింది. ఏఏ మొబైల్స్ ను ఆండ్రాయిడ్ 13 ఇవ్వనున్నదో వెల్లడించింది తొలిదశలో మొత్తంగా 10 మోటో స్మార్ట్ ఫోన్ లకు ఆండ్రాయిడ్ 13 రోల్ ఔట్ చేయనున్నట్లు వెల్లడించింది.
ఆండ్రాయిడ్ 13 అప్డేట్ ను 4 ఎడ్జ్ మోడల్స్, 6జీ సిరీస్ ఫోన్ లకు ఇవ్వనున్నట్టు మోటోరోలా వెల్లడించింది. మోటో ఎడ్జ్ 30 ప్రో, మోటో ఎడ్జ్ 30, మోటో ఎడ్జ్+(2022), మోటో ఎడ్జ్ (2022), మోటో జీ82 5జీ, మోటో జీ62 5జీ, మోటో జీ42, మోటో జీ32, మోటో జీ 5జీ, మోటో జీ స్టైలస్ 5జీ కాగా భవిష్యత్తులో మరికొన్ని మొబైల్స్ కూడా ఆండ్రాయిడ్ 13 అప్డేట్ను మోటోరోలా అందించే అవకాశం ఉంది. దశలవారీగా మోడల్స్ ప్రకటించే అవకాశం ఉంది. పిక్సెల్ స్మార్ట్ ఫోన్ లకు ఆండ్రాయిడ్ 13 అప్డేట్ ను ఇస్తున్నట్లు గూగుల్ ఇటీవల ప్రకటించింది. ఈ సంవత్సరం అప్డేట్ను అందుకునే ఇతర కంపెనీలకు చెందిన కొన్ని స్మార్ట్ ఫోన్లను కూడా వెల్లడించింది.
పిక్సెల్ స్మార్ట్ ఫోన్లు తర్వాత ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ను ఐకో 9 ప్రో, వివో ఎక్స్80 ప్రో ఫోన్లు అందుకొని ఉన్నాయి. ఈనెల 23న ప్రివ్యూ ప్రోగ్రాం కింద ఈ రెండు మొబైల్ లకు ఆండ్రాయిడ్ 13 అప్డేట్ అందుతుంది.. అయితే ఇందుకోసం ఈ మొబైల్ వాడుతున్నవారు అప్డేట్ సెక్షన్లో 22వ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ ఏడాది చివరి కల్లా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లకు ఆండ్రాయిడ్ 13 అప్డేట్ అందే ఛాన్స్ ఉంది. మోటోరోలా ఎడ్జ్ స్పెసిఫికేషన్ లు పర్ఫామెన్స్ snapdragon 765G,స్టోరేజ్ ఫైల్ 128 GB, కెమెరా 64Mp+16MP+8MP, బ్యాటరీ 4500mAh,డిస్ ప్లే 6.7″(17.02cm),ర్యామ్ 4జీబిను కలిగి ఉంది.