5G Smartphones : 25 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్స్ ఇవే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

5G Smartphones : 25 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్స్ ఇవే…

 Authored By aruna | The Telugu News | Updated on :4 September 2022,10:00 pm

5G Smartphones : ఇండియాలో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన రిలయన్స్ 5జీ నెట్ వర్క్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ దీపావళి నాటికల్లా ఇండియాలో మొదటి 4 ప్రధాన నగరాల్లో జియో ట్రూ 5జీ లాంచ్ చేస్తామని ప్రకటించారు. దీంతో మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 5జీ నెట్వర్క్ కు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ లను అందరూ ఎక్కువగా కొనే అవకాశం ఉంది. కాబట్టి ఫోన్లకు కూడా డిమాండ్ పెరిగిపోతుంది అందుకే మార్కెట్లో రూ.25,000 లోపు లభిస్తున్న బెస్ట్ 5జీ మొబైల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

షావోమీ 11 లైట్ NE 5G: ఈ స్మార్ట్ ఫోన్ 6జీబీ రామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. 8 జిబి ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 26, 999. ఈ ఫోన్లు బ్యాంక్ ఆఫర్స్ తో కేవలం 25 వేల లోపే లభిస్తున్నాయి ఈ స్మార్ట్ ఫోన్లో జాజ్ బ్లూ, వినైల్ బ్లాక్, డైమండ్ డాజిల్ కలర్స్ లో అందుబాటులో ఉంది. 90Hz రిఫ్రెష్ రేటుతో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డి సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, క్వల్కమ్ స్నాప్ డ్రాగన్ 778 జి ప్రాసెసర్ తో పనిచేస్తుంది. మెయిన్ కెమెరా 64 మెగా పిక్సెల్, సెల్ఫీ కెమెరా 20 మెగా పిక్సెల్ తో అందుబాటులో ఉంది. అలాగే 33w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4250mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది.

5G smartphones are available under 25 thousand rupees

5G smartphones are available under 25 thousand rupees

సామ్ సంగ్ గెలాక్సీ M53 5G: ఈ స్మార్ట్ ఫోన్ 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,499. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,499. అయితే ఈ రెండు ఫోన్లు అమెజాన్ లో బ్యాంక్ ఆఫర్స్ తో కేవలం 25 వేల లోపే లభిస్తున్నాయి. ఇక ఈ స్మార్ట్ ఫోన్లు డీప్ ఓషియన్ బ్లూ, మిస్టిక్ గ్రీన్ కలర్స్ లో అందుబాటులో ఉంది. 120Hz రిఫ్రెష్ రేటు తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డి సూపర్ అమోలేట్ ఇన్ఫినిటీ ఓ డిస్ ప్లే, మీడియా టెక్ డైమన్సిటీ 900 ప్రాసెసర్ తో వస్తుంది. 25w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ ని కలిగి ఉంది. దీనికి మెయిన్ కెమెరా 108 మెగా పిక్సెల్, సెల్ఫీ కెమెరా 32 పిక్సెల్ అందించడం జరిగింది.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది