Bicycle : మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్..గంటకు 25KM స్పీడ్ తో పది రూపాయల ఖర్చుతో.. 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు..!!
Bicycle : భారతదేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్న పెట్రోల్ రేటులు మాత్రం తగ్గటం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు పెంచేస్తూ ఉన్నాయి. మరో పక్క వీటివల్ల కలిగే కాలుష్యం కారణంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు వాహన ప్రేమికులను ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. భారతదేశంలో గత మూడు సంవత్సరాల నుండి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగింపు పెరిగాయి. దీంతో చాలా పలు ఎలక్ట్రిక్ కంపెనీలు రకరకాల వాహనాలను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి.
ఈ రకంగానే కొత్తగా మార్కెట్ లోకి టాటా స్ట్రైడర్ జటా ప్లస్ అనే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ రావటం జరిగింది. దీని ధర 26 వేల 995 రూపాయలు.. నుండి ప్రారంభం కానుంది. ఇటీవలే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్ లోకి తీసుకురావడంతో… దీని ధర 6 వేల రూపాయలు తగ్గించి ఇస్తూ ఉన్నారు. త్వరలోనే దీని ధర 32,990 రూపాయలకు పెంచనున్నట్లు అధికారిక వెబ్ సైట్ వెల్లడించడం జరిగింది. ఈ సైకిల్ టాటా కంపెనీ అనుసంధానంతో రూపొందించారు. ప్రారంభంలోనే ఈ సైకిల్ కొనుగోలు చేస్తే రెండేళ్ల వారంటీని కూడా పొందవచ్చు. ఈ సైకిల్ లో కంపెనీ 250 డబ్ల్యూ.. బిఎల్డిసి మోటార్ ను ఉపయోగించింది.
ఈ సైకిల్‌లో 36V-6Ah బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది 216 డబ్ల్యూహెచ్ పవర్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల వరకు ఈ సైకిల్ ప్రయాణించగలదు. గంటకు 25 కిలోమీటర్లు దీని టాప్ స్పీడ్. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌లో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లను అందించింది. దీని కారణంగా ఈ సైకిల్‌ను బాగా కంట్రోల్ చేయవచ్చు.