iPhone 15 : త్వరలో మార్కెట్లోకి రాబోతున్న ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్… ఫీచర్స్ ఇవే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

iPhone 15 : త్వరలో మార్కెట్లోకి రాబోతున్న ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్… ఫీచర్స్ ఇవే…

iPhone 15 : ప్రస్తుతం ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది చాలా ముఖ్యమైంది. ప్రతి ఒక్కరికి మొబైల్స్ జీవితంలో నిత్యవసర వస్తువులుగా మారిపోయాయి. ఈ స్మార్ట్ ఫోన్ ల వలన ప్రతిదీ ఇంట్లో కూర్చుని అన్ని పనులను చేస్తున్నారు. ఫోన్ ధర ఎంత ఉన్నా కచ్చితంగా కొనే తీరుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా పనులు ఫోన్ల ద్వారానే అవుతున్నాయి కాబట్టి. అందుకే మొబైల్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్త ఫోన్లను విడుదల చేస్తూ వస్తున్నాయి. […]

 Authored By aruna | The Telugu News | Updated on :16 September 2022,10:00 pm

iPhone 15 : ప్రస్తుతం ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది చాలా ముఖ్యమైంది. ప్రతి ఒక్కరికి మొబైల్స్ జీవితంలో నిత్యవసర వస్తువులుగా మారిపోయాయి. ఈ స్మార్ట్ ఫోన్ ల వలన ప్రతిదీ ఇంట్లో కూర్చుని అన్ని పనులను చేస్తున్నారు. ఫోన్ ధర ఎంత ఉన్నా కచ్చితంగా కొనే తీరుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా పనులు ఫోన్ల ద్వారానే అవుతున్నాయి కాబట్టి. అందుకే మొబైల్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్త ఫోన్లను విడుదల చేస్తూ వస్తున్నాయి. అయితే ఆపిల్ ఐఫోన్ వాడడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ కల. ఎప్పటికైనా ఐఫోన్ కొనుక్కోవాలని టార్గెట్ పెట్టుకుంటారు. ఐఫోన్ ప్రేమికుల కోసం ఆపిల్ మరిన్ని ఫీచర్స్ తో అప్డేట్ వెర్షన్ తో ఫోన్లను తీసుకొస్తుంది.

ఇటీవల ఐఫోన్ 14 సిరీస్ ను మార్కెట్లోకి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఐఫోన్ 15 ప్రో కూడా మార్కెట్లోకి రానుంది. అయితే దీనికి మరింత సమయం పట్టనుంది. సెప్టెంబర్ 30, 2023 వ తేదీన ఇండియాలో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 15 సిరీస్ మొబైల్ తగిన స్పెసిఫికేషన్లతో వస్తుందని దీని ధర 1,03,110తో ప్రారంభమవుతుందని ఒక అంచనా. ఐఫోన్ 15 ప్రో లైన్ అప్ ను కొత్త బయోనిక్A17 చిప్ సెట్ తో ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిప్సెట్ తైవాన్ సెమీ కండక్టర్ మేకర్ తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ (TSMC) ద్వారా 3nm ఆర్కిటెక్చర్ పై నిర్మించనున్నారు.

Apple iPhone 15 series coming soon in India

Apple iPhone 15 series coming soon in India

3nm చిప్ సెట్ M3 చిట్సెట్లో కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆపిల్ మ్యాక్స్ కోసం TSMC డెవలప్ చేసిన 3nm ప్రాసెస్ ఆధారిత M3 చిప్ ను వచ్చే ఏడాది రిలీజ్ చేయనుంది. ఐఫోన్ 15 ప్రో మోడల్ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఆపిల్ వచ్చే నెలలో ఐపాడ్ ప్రో ని M2 చిప్ తో అప్ డేట్ చేయబోతుందట. గత వారం టెక్ దిగ్గజం TSMC 4nm ప్రాసెస్ ఆధారంగా A16 చిప్ తో నీ ఫోన్ 14 ప్రో మోడల్ ఆవిష్కరించింది. అయితే ప్రామాణిక ఐఫోన్ 14 ,ఐఫోన్ 14 ప్లస్ మోడల్ లు మునుపటి తరం A15 చిప్ తో అమర్చారు. ఇప్పుడు మరిన్ని ఫీచర్స్ తో ఐఫోన్ 15 సిరీస్ రాబోతున్నట్లు తెలుస్తుంది

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది