iPhone 15 : ప్రస్తుతం ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది చాలా ముఖ్యమైంది. ప్రతి ఒక్కరికి మొబైల్స్ జీవితంలో నిత్యవసర వస్తువులుగా మారిపోయాయి. ఈ స్మార్ట్ ఫోన్ ల వలన ప్రతిదీ ఇంట్లో కూర్చుని అన్ని పనులను చేస్తున్నారు. ఫోన్ ధర ఎంత ఉన్నా కచ్చితంగా కొనే తీరుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా పనులు ఫోన్ల ద్వారానే అవుతున్నాయి కాబట్టి. అందుకే మొబైల్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్త ఫోన్లను విడుదల చేస్తూ వస్తున్నాయి. అయితే ఆపిల్ ఐఫోన్ వాడడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ కల. ఎప్పటికైనా ఐఫోన్ కొనుక్కోవాలని టార్గెట్ పెట్టుకుంటారు. ఐఫోన్ ప్రేమికుల కోసం ఆపిల్ మరిన్ని ఫీచర్స్ తో అప్డేట్ వెర్షన్ తో ఫోన్లను తీసుకొస్తుంది.
ఇటీవల ఐఫోన్ 14 సిరీస్ ను మార్కెట్లోకి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఐఫోన్ 15 ప్రో కూడా మార్కెట్లోకి రానుంది. అయితే దీనికి మరింత సమయం పట్టనుంది. సెప్టెంబర్ 30, 2023 వ తేదీన ఇండియాలో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 15 సిరీస్ మొబైల్ తగిన స్పెసిఫికేషన్లతో వస్తుందని దీని ధర 1,03,110తో ప్రారంభమవుతుందని ఒక అంచనా. ఐఫోన్ 15 ప్రో లైన్ అప్ ను కొత్త బయోనిక్A17 చిప్ సెట్ తో ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిప్సెట్ తైవాన్ సెమీ కండక్టర్ మేకర్ తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ (TSMC) ద్వారా 3nm ఆర్కిటెక్చర్ పై నిర్మించనున్నారు.
3nm చిప్ సెట్ M3 చిట్సెట్లో కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆపిల్ మ్యాక్స్ కోసం TSMC డెవలప్ చేసిన 3nm ప్రాసెస్ ఆధారిత M3 చిప్ ను వచ్చే ఏడాది రిలీజ్ చేయనుంది. ఐఫోన్ 15 ప్రో మోడల్ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఆపిల్ వచ్చే నెలలో ఐపాడ్ ప్రో ని M2 చిప్ తో అప్ డేట్ చేయబోతుందట. గత వారం టెక్ దిగ్గజం TSMC 4nm ప్రాసెస్ ఆధారంగా A16 చిప్ తో నీ ఫోన్ 14 ప్రో మోడల్ ఆవిష్కరించింది. అయితే ప్రామాణిక ఐఫోన్ 14 ,ఐఫోన్ 14 ప్లస్ మోడల్ లు మునుపటి తరం A15 చిప్ తో అమర్చారు. ఇప్పుడు మరిన్ని ఫీచర్స్ తో ఐఫోన్ 15 సిరీస్ రాబోతున్నట్లు తెలుస్తుంది
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
Tollywood Actors : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించడం చాలా అరుదు. ప్రత్యేక సందర్భాలలో వారు కలిసి…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌ని చూస్తుంటే వారు సెలబ్రిటీల మాదిరిగా కనిపించడం లేదు.…
RBI : ఆర్ధిక అవసరాల దృష్ట్యా చూస్తే చాలామంది తమ బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ ను ఉంచడంలో విఫలమవుతున్నారు.…
Coconut Oil : కొబ్బరి చెట్టును కల్ప వృక్షం అని అంటారు. ఎందుకు అంటే ఈ చెట్టు నుండి దొరికే అన్ని…
Airport Jobs : ఏ.ఐ ఎయిర్ పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ (ఏ.ఐ.ఏ.ఎస్.ఎల్) అనే సంస్థ ఎయిర్ పోర్ట్ సర్వీసుల కోసం…
This website uses cookies.