Phone : ఫోన్ వాడకం కూడా జ్యోతిష్యం ప్రకారమేనా..? వామ్మో..!
ప్రధానాంశాలు:
Phone : ఫోన్ వాడకం కూడా జ్యోతిష్యం ప్రకారమేనా..? వామ్మో..!
Phone : జ్యోతిష్యాన్ని నమ్మేవారికి ఇది ఆసక్తికరంగా అనిపించవచ్చు కానీ తాజాగా వాట్సాప్ లో హల్‌చల్ చేస్తున్న ఓ సందేశం మాత్రం నవ్వు తెప్పిస్తుంది. “ఏ రాశివారు ఏ ఫోన్ వాడితే మంచిది” అన్నదే ఆ మెసేజ్ సారాంశం. ఆధ్యాత్మిక నిపుణుల సలహాలతో మాత్రమే కాదు, ఇప్పుడు మొబైల్ ఫోన్ల విషయంలో కూడా రాశి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పడం హాస్యాస్పదంగా మారింది.

Phone : ఫోన్ వాడకం కూడా జ్యోతిష్యం ప్రకారమేనా..? వామ్మో..!
Phone మీరు ఏ ఫోన్ పడితే ఆ ఫోన్ వాడకూడదట.. జ్యోతిష్యం ఇదే చెపుతుంది
ఓపిక ఎక్కువ లేని వారు అంటే మేషరాశి వారికి ఎక్కువ RAM ఉన్న ఫోన్లు అవసరమట, ప్రకృతిని ప్రేమించే వృషభరాశి వారు శాంసంగ్ ఫోన్లు వాడాలట.
సింహరాశి వారు విలాసవంతంగా ఉండాలనుకుంటారని చెబుతూ, ఐఫోన్ వాడాలన్న సలహా, లేదా వృశ్చికరాశి వారు నోకియా ఫోన్ వాడాలట. తులా రాశి వారు సంగీతం, పుస్తకాల పట్ల ఆసక్తి చూపే వారంటూ భారీ స్టోరేజ్ ఫోన్లు వాడాలంటారు. మరి ఇలాంటివి ఎంతమంది ఆచరిస్తారో కానీ, ప్రస్తుతం మాత్రం ఇది చూసి అంత నవ్వుకుంటున్నారు.