Paytm App : మీ ఫోన్ లో పేటీఎం యాప్ ఉంటె ఈ న్యూస్ చదవాల్సిందే !
Paytm App : మీరు పేటీఎం వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే పేటీఎంతో చాలా రకాల పనులు చేసుకోవచ్చు. అందుకే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు పేటీఎం వాడుతుంటారు. గూగుల్ పే, ఫోన్ పే రాకముందు నుంచి పేటీఎం ఉంది. అసలు మానటైజేషన్ తర్వాత పేటీఎం యాప్ కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఆన్ లైన్ లావాదేవీలు ఒక్కసారిగా బూమ్ అంటూ పెరగడంతో అందరూ పేటీఎం యాప్ పై పడ్డారు. అప్పటి వరకు పేటీఎం యాప్ కు పెద్దగా గుర్తింపు లేనప్పటికీ.. మానటైజేషన్ తర్వాత దానికి బాగా క్రేజ్ పెరిగింది.
ఆ తర్వాత ఆన్ లైన్ లావాదేవీల విలువను గుర్తించి పేటీఎం తరహాలో గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. గూగుల్ పే, ఫోన్ పే వచ్చాక పేటీఎం హవా అయితే తగ్గింది. అందుకే పేటీఎం పలు రకాల ఆఫర్లను అందిస్తోంది. అందులో భాగంగానే పేటీఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను తన యాప్ కు వాడనుందట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ మైండ్ కంటే కూడా లక్ష రెట్లు ఎక్కువగా ఆలోచిస్తుంది.
Paytm App : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లాభమేంటి?
టెక్నాలజీ పరంగా జరగబోయే సైబర్ నేరాలను ముందే పసిగడుతుంది. హ్యాకర్స్ యాప్ లోకి చొచ్చుకొని వచ్చినా తన టెక్నాలజీతో వాళ్లను చిత్తు చేస్తుంది. ఆన్ లైన్ లో జరిగే ఎన్నో మోసాలను ఇది చెక్ పెట్టడమే కాదు.. యూజర్లకు బెస్ట్ సర్వీసులను అందిస్తుంది. అందుకే.. పేటీఎం యాప్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎంబెడ్ చేసేందుకు వర్క్ చేస్తున్నట్టు పేటీఎం ప్రకటించింది. దీని వల్ల ప్రస్తుతం జరిగే లావాదేవీలు 10 శాతం ఎక్కువ సామర్థ్యంతో నిర్వహించబడతాయని సంస్థ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పేటీఎం లాభాల్లో దూసుకుపోతోంది. ఆ మధ్య నష్టాల్లో ఉన్నా.. ఇప్పుడు కవర్ అయింది.