CNG Bike : ప్ర‌పంచంలోనే మూడు వేరియెంట్ల‌లో తొలి సీఎన్‌జీ బైక్.. ధ‌ర ఎంతంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CNG Bike : ప్ర‌పంచంలోనే మూడు వేరియెంట్ల‌లో తొలి సీఎన్‌జీ బైక్.. ధ‌ర ఎంతంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :6 July 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  CNG Bike : ప్ర‌పంచంలోనే మూడు వేరియెంట్ల‌లో తొలి సీఎన్‌జీ బైక్.. ధ‌ర ఎంతంటే..!

CNG Bike : ఎన్నో రోజులుగా బ‌జాజ్ సీఎన్‌జీ కోసం వాహ‌న‌దారులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, ఎట్ట‌కేల‌కి అది వ‌చ్చేసింది. ప్రపంచంలోనే తొలి కంప్రెస్డ్‌ నాచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) ఆధారిత మోటర్‌సైకిల్‌ను ‘ఫ్రీడమ్‌ 125’ పేరిట భారతీయ సంస్థ బజాజ్‌ ఆటో ఆవిష్కరించింది. శుక్రవారం ఇక్కడ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సమక్షంలో బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్ కొత్త బైక్‌ని ఇంట్ర‌డ్యూస్ చేశారు. తొలుత మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ టూవీలర్‌.. ఆ తర్వాత దేశంలోని మిగతా రాష్ర్టాల మార్కెట్లలోకి కూడా వస్తుందని కంపెనీ ప్రకటించింది. కాగా, పర్యావరణహిత వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను తగ్గించాలని ఈ సందర్భంగా రాజీవ్‌ బజాజ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

CNG Bike స‌గం ఖర్చు త‌గ్గుతుంది..

కాస్ట్ సేవింగ్ పరంగా చూస్తే.. ఈ బైక్ అందరి ఛాయిస్ అవుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ బైక్ రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువగానే ఉంది. ఇంకా మార్కెట్‌లోకి ఇతర పెట్రోల్ బైక్స్ ధరతో పోలిస్తే దీని రేటు కూడా ఆమోదయోగ్యంగానే ఉంది.బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ ధర రూ. 95 వేల నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే గరిష్ట ధర రూ. 1.10 లక్షల వరకు ఉంది. ఈ మోటార్‌సైకిల్ రేంజ్ 330 కిలోమీటర్లు. ఇందులో 2 కేజీల సీఎన్‌జీ ట్యాంక్ ఉంటుంది. అలాగే 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా అమర్చారు.దేశవ్యాప్తంగా ఉన్న ఆథరైజ్డ్‌ బజాజ్‌ షోరూంలతోపాటు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మోటర్‌సైకిల్స్‌ను బుక్‌ చేసుకోవచ్చు. ఇక 5 కలర్లలో లభించే ఈ బైక్‌లలో సీఎన్‌జీ కోసం ఒకటి, పెట్రోల్‌ కోసం ఇంకొకటి మొత్తం రెండు ఇంధన ట్యాంక్‌లున్నాయి. వీటికి వేర్వేరు స్విచ్‌లుంటాయి. ఏది ఆన్‌ చేస్తే అందులోనే బైక్‌ నడుస్తుంది.

CNG Bike ప్ర‌పంచంలోనే మూడు వేరియెంట్ల‌లో తొలి సీఎన్‌జీ బైక్ ధ‌ర ఎంతంటే

CNG Bike : ప్ర‌పంచంలోనే మూడు వేరియెంట్ల‌లో తొలి సీఎన్‌జీ బైక్.. ధ‌ర ఎంతంటే..!

రెండు ట్యాంక్‌లను ఫుల్‌ చేస్తే మొత్తంగా 330 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని పేర్కొన్నది.సీఎన్‌జీ వాడకంతో కిలోమీటర్‌ ప్రయాణ ఖర్చు రూపాయి, అంతకన్నా తక్కువేనన్నది. కేవలం పెట్రోల్‌ ఆధారంగానే నడిచే బైక్‌ల ప్రయాణ ఖర్చుతో చూస్తే ఇది సగమేనని గుర్తుచేసింది. ఈ క్రమంలోనే ఫ్రీడమ్‌ 125 ఓనర్లు ఇతర 125సీసీ బైక్‌ రైడర్లతో పోల్చితే ఐదేండ్లలో రూ.75,000 వరకు ఆదా చేసుకోవచ్చని బజాజ్‌ ఆటో తెలియజేసింది. పెట్రోల్ 2 వీలర్ కాస్ట్ కిలోమీటరుకు రూ.2.25 వరకు వస్తుందని , అదే సీఎన్‌జీ బైక్ అయితే కిలోమీటరుకు రూ.1 మాత్రమే ఖర్చు వస్తుందని వెల్లడించారు. రౌండ్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీతో ఎల్‌సీడీ ఇన్‌స్ట్రూమెంట్‌ కన్సోల్‌ సౌకర్యం ఇందులో ఉంది. 125సీసీ ఇంజిన్‌, టెలిస్కోపిక్‌ ఫోర్క్స్‌, ప్రభావవంతమైన బ్రేకింగ్‌ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది