Chat GPT : వాడ‌కం అంటే మ‌నోళ్ల‌దే.. ఎర్ర పుచ్చ‌కాయ‌ని గుర్తించేందుకు చాట్ జీపీటీ..వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chat GPT : వాడ‌కం అంటే మ‌నోళ్ల‌దే.. ఎర్ర పుచ్చ‌కాయ‌ని గుర్తించేందుకు చాట్ జీపీటీ..వీడియో !

 Authored By ramu | The Telugu News | Updated on :16 April 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Chat GPT : వాడ‌కం అంటే మ‌నోళ్ల‌దే.. ఎర్ర పుచ్చ‌కాయ‌ని గుర్తించేందుకు చాట్ జీపీటీ

Chat GPT : ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన ఏఐ ఆధారిత చాట్ జీపీటీ గురించి తెలియని వారు ఇప్పుడు లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఏదైనా విషయం కోసం టైప్ చేయాలన్నా, దేని గురించైనా తెలుసుకోవాలన్నా చాట్ జీపీటీలోనే సెర్చ్ చేస్తున్నారు. ఇది యూజర్ అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకుని పూర్తి వివరాలతో చిటికెలో సమాధానాన్ని అందిస్తుంది . వినియోగదారులకు కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో అందిచడంతో టెక్ ప్రియులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

Chat GPT వాడ‌కం అంటే మ‌నోళ్ల‌దే ఎర్ర పుచ్చ‌కాయ‌ని గుర్తించేందుకు చాట్ జీపీటీ

Chat GPT : వాడ‌కం అంటే మ‌నోళ్ల‌దే.. ఎర్ర పుచ్చ‌కాయ‌ని గుర్తించేందుకు చాట్ జీపీటీ

Chat GPT ఇదో ర‌కం వాడ‌కం..

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్ ఎప్పుడు ముందుంటుంది. కానీ అన్ని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ సత్తాచాటింది. చాట్ జీపీటి గురించి చేపట్టిన పరిశోధనల్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను వెనక్కి నెట్టి తెలంగాణ టాప్ లో నిలిచింది. అయితే మ‌నోళ్లు చాట్ జీపీటీ వాడ‌కం చూస్తే అంద‌రు ముక్కున వేలేసుకుంటున్నారు. ఓ వ్యక్తి పుచ్చకాయ కొనేందుకు కూడా చాట్ జీపీటీ వినియోగించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

చాట్ జీపీటీ సాయంతో అతడు స్వీట్ మరియు రెడ్గా ఉన్న పుచ్చకాయని గుర్తించే ప్ర‌య‌త్నం చేశాడు. చాట్ జీపీటీ సాయంతో కొన్నింటిని పరిశీలించాక ఒకదానిని అది సూచించింది. కట్ చేసి చూడగా పండు ఎర్రగా ఉంది. చాట్ జీపీటీ బాగానే వ‌ర్క్ అవుతుంద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. ఇలా ఒక‌టి కాదు చాట్ జీపీటీ సాయంతో మ‌నోళ్లు చేయ‌ని ప్ర‌యోగాలు లేవు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది