Smartphone : మీరు కొన్న ఫోన్ కొత్తదా.. పాతదా.. తెలుసుకోవాలంటే ఇలా చేయండి…
Smartphone : ప్రస్తుతం చాలామంది ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు. పండుగ సీజన్ కావడంతో ఆన్లైన్లో వివిధ ప్రొడక్టులపై భారీ ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై ఎన్నడూ లేనివిధంగా ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలో అసలు మనం కొనుగోలు చేసిన ఫోన్ కొత్తదా లేక పాతదా.. పాత ఫోను రిఫర్బిష్ డ్ చేసి అమ్ముతున్నారా.. అనే అనుమానాలు వచ్చే ఉంటాయి. అయితే మనం కొన్న ఫోన్ నిజంగానే కొత్తగా కాదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. దాంతో మీ ఫోన్ స్టేటస్ ఏంటో తెలుసుకోవచ్చు.
కొత్త ఫోను ఆన్ చేసిన వెంటనే డైలర్ ప్యాడ్ లో #06#అని టైప్ చేయగానే ఐఎంఈఐ నెంబర్ మోడల్ నెంబర్స్ స్క్రీన్ పై కనబడతాయి. దాంట్లో ఉన్న నెంబర్ మీ ఫోన్ బాక్స్ మీద ఉన్న నెంబర్లు ఒకటా కాదా అని చూసుకోవాలి. ఆ రెండు నెంబర్లు ఒకటైతే అది కొత్త ఫోన్ అవుతుంది. అలా కాకుండా వేరువేరుగా ఉంటే మాత్రం అది పాత ఫోను అని అర్థం. అలాగే డైలాగ్ ప్యాడ్ లో ##4636## అని టైప్ చేయాలి. ఒకవేళ సిమ్ స్టేటస్ నన్ అని చూపిస్తే అది ఒరిజినల్ మొబైల్ అని గుర్తించాలి. ఇక మూడో ట్రిక్ ఏంటంటే ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్లి అబౌట్ ఫోన్లోకి వెళ్లి స్టేటస్ ఓపెన్ చేయాలి.
అందులో సిమ్ స్టేటస్ లేదా ఐఎంఈఐ ఇన్ఫర్మేషన్ ఆథప్షన్స్ ఓపెన్ చేయాలి. ఐఎంఈఐ ఇన్ఫర్మేషన్ లో సిమ్ స్లాట్ లో 00 ఉంటే అది కొత్త ఫోన్. వేరే నెంబర్స్ ఉంటే అది వాడిన ఫోన్ అని అర్థం. ఆపిల్ వినియోగదారులు తన ఫోన్ కొత్తదో కాదో తెలుసుకోవడానికి ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్లి జనరల్ లోకి వెళ్ళాలి. అనంతరం అబౌట్ ఫోన్ క్లిక్ చేసి ఫోన్ వివరాలు వస్తాయి. అందులో మోడల్ నెంబర్ M అనే లెటర్ మొదలైతే అది ఒరిజినల్ ఫోన్ అవుతుంది. F తో మొదలైతే రిఫర్బిష్డ్ అని, N ఉంటే ఫోన్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ తో రిటర్న్ చేశారని, P తో మొదలైతే డ్యామేజ్డ్ ఫోన్ అని అర్థం.