Cyber Fraud : సైబర్ మోసాల బాధితులకు శుభవార్త .. నష్టపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం రిఫండ్..!
ప్రధానాంశాలు:
Cyber Fraud : సైబర్ మోసాల బాధితులకు శుభవార్త .. నష్టపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం రిఫండ్..!
Cyber Fraud : దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా, బ్యాంక్ అకౌంట్లు, ఓటీపీలు, ఫిషింగ్ లింకులు వంటి వివిధ మార్గాల్లో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగించి లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాధితులకు తక్షణ ఉపశమనం కల్పించాల్సిన అవసరంపై కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ఆర్థిక మోసాల బాధితులకు త్వరితగతిన సహాయం అందించేందుకు కేంద్ర హోంశాఖ (MHA) కీలక అడుగు వేసింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) పరిధిలో పనిచేసే సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) కోసం కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) కు తాజాగా ఆమోదం తెలిపింది.
Cyber Fraud : సైబర్ మోసాల బాధితులకు శుభవార్త .. నష్టపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం రిఫండ్..!
Cyber Fraud రూ.50 వేల వరకూ నేరుగా రిఫండ్
కొత్త నిబంధనల ప్రకారం సైబర్ మోసాల వల్ల నష్టపోయిన బాధితులకు రూ.50,000 వరకు ఉన్న మొత్తాలను కేంద్రమే నేరుగా తిరిగి చెల్లించే విధానం అమలులోకి రానుంది. ఇందుకు కోర్టు ఆదేశాలు అవసరం లేకుండానే రిఫండ్ ప్రాసెస్ వేగంగా పూర్తయ్యేలా SOPను రూపొందించారు. అలాగే, కోర్టు లేదా రికవరీ ఆదేశాలు లేనిపక్షంలో, బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు 90 రోజుల్లోపు ఫ్రీజ్ చేసిన అకౌంట్లపై ఆంక్షలను తొలగించాలని కేంద్రం సూచించనుంది. సైబర్ నేరంపై ఫిర్యాదు నమోదైన వెంటనే ఈ SOP ప్రకారం బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, స్టాక్ ట్రేడింగ్ యాప్‌లు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఇతర ఆర్థిక మధ్యవర్తులు తప్పనిసరిగా అనుసరించాల్సిన విధానాలను కేంద్రం స్పష్టంగా నిర్దేశించింది.
గత ఆరు సంవత్సరాల్లో సైబర్ మోసాల కారణంగా భారతీయులు రూ.52,976 కోట్లకు పైగా నష్టపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటం, జాతీయ సైబర్ ఆర్థిక భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయ లక్ష్యమని కేంద్రం భావిస్తోంది. సైబర్ నేరాల నియంత్రణలో ఇది ఒక కీలక మైలురాయిగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.