Cyber Frauds : సైబర్ మోసాలు , లోన్ Apps వేధింపులకి గురి అవుతున్న వాళ్లకి Best Solution ఇదే ..!
ప్రధానాంశాలు:
Cyber Frauds : సైబర్ మోసాలు , లోన్ Apps వేధింపులకి గురి అవుతున్న వాళ్లకి Best Solution ఇదే ..!
Cyber Frauds : గ్లోబల్ సెక్యూరిటీ కౌన్సిల్ Global Security Council అనే సంస్థ సైబర్ ఫ్రాడ్ లని చేధిస్తూ అనేకమంది సామాన్యులని సైబర్ మోసగాళ్ళ బారిన పడకుండా రక్షిస్తోంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు చుండూరి రాధాకృష్ణ 2020 కోవిడ్ లాక్ డౌన్ టైం లో అప్పటి సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ స్థాపించిన కోవిడ్ వాలంటరీ ఫోర్స్ లో ప్లాస్మా దానం మీద అందరికీ అవగాహన కల్పిస్తూ ఎందఱో ప్రాణాలని కాపాడారు. ఆ ప్రోగ్రాం లో రాధాకృష్ణ పనితీరు నచ్చి ‘ సైబర్ వాలంటీరింగ్ ‘ అనే కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టి రాధాకృష్ణ ద్వారా కొన్ని స్కూల్స్ కాలేజీలలో అవగాహన క్లాస్ లు చెప్పే బాధ్యత అప్పగించారు. అదే సమయం లో రాధాకృష్ణ సైతం ప్లే స్టోర్ లో ఒక యాప్ క్లిక్ చెయ్యడం వల్ల ఆటోమేటిక్ గా తన ఎకౌంటు లోంచి డబ్బులు కోల్పోయారు .. సైబర్ fraudsters యొక్క వేధింపులకి గురి అయ్యారు.
ఎక్కువ మొత్తం డబ్బులు ఇవ్వకపోతే వాట్సాప్ కాంటాక్ట్ లకి ఇతని ఫోటో లు మార్ఫింగ్ చేసి పంపిస్తాము అని బెదిరించడం తో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు రాధాకృష్ణ. ఆ టైం లో సజ్జనార్ గారి సహాయం తో డిప్రెషన్ లో నుంచి బయటకి వచ్చి , తనలాంటి సైబర్ వాలంటీరింగ్ లో ఉన్న వారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని అర్ధం చేసుకుని సజ్జనార్ గారి ప్రోద్బలం తో ‘ అగస్త్య ఇన్ఫోటెక్ ‘ ని స్థాపించారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం సైబర్ awareness మరియూ లోన్ apps ద్వారా వేధింపులకి గురి అయ్యే వాళ్ళని కాపాడడం. ఇందుకోసం ఒక యాప్ ని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. ఈ మొత్తం కార్యక్రమం కోసం ఇన్వెస్టర్ ల అవసరం కూడా ఉంది, ఫండ్స్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గ్లోబల్ గా జరిగే సైబర్ ఫ్రాడ్స్ ని అరికట్టే ఆలోచనలో భాగం గా ఈ వెబ్సైటు కి గ్లోబల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనే పేరు పెట్టారు. 10 మందికి పైగా interns , ఆరుగురు వ్యవస్థాపకులు ఇందులో పని చేస్తున్నారు. సామాన్యుడు సైబర్ నేరాలకి గురి కాకుండా, లోన్ apps యొక్క వేధింపులకి బలి అవ్వకుండా చిన్న వయసులో వీరు చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే . ఇతర సమాచారం కోసం ఈ వెబ్సైటు openచేయండి.