Death Clock APPs : ఎప్పుడు చనిపోతారో చెప్పే యాప్స్ ఉన్నాయని మీకు తెలుసా..?
ప్రధానాంశాలు:
Death Clock APPs : ఎప్పుడు చనిపోతారో చెప్పే యాప్స్ ఉన్నాయని మీకు తెలుసా..?
Death Clock APPs : టైటిల్ చూసి కాస్త షాకింగ్ గా ఉన్నా ఇది కొంత ప్రభావితం చూపించే అవకాశం ఉంది. ఐతే మనిషి పుట్టుక చావు అనేది మనం చేతిలో ఉండేది కాదు. ఐతే ఎందుకో పుట్టుక మీద భయం ఉండదు కానీ చావు మీద ఉంటుంది. కొందరు నిత్యం మరణ భయంతొ ఉంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న బాధతో ఉంటారు. ఇలాంటి వారు ఇంటర్నెట్ లో రకరకాల అప్లికేషన్స్ ను చూస్తుంతారు. ఐతే సైన్స్, వాస్తవ సంబంధాల అభిప్రాయాలకు దూరంగా పనిచేసే కొన్ని అప్లికేషన్స్ ని చూసి అది నిజమే అనుకుంటారు.
అందులో ఒకటి డెత్ డేట్ కాలిక్యులేటర్.. ఇలాంటి అప్లికేషన్స్ కొన్ని యాప్స్ వారి ప్రయోజనాల కోసం తయారు చేస్తారు. జన్మతేదీ, పెరు, జ్యోతిష్య్తం ఇస్తే అవతల వ్యక్తి యొక్క జాతకాన్ని బట్టి చావు కబురు చల్లగా అన్నట్టుగా మరణం చెందే తేడీ ని చెబుతారట. అసలు దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు కానీ జ్యోతిష్య శాస్త్రం, ఇంకా ఇతర మానవీయ విశ్లేషణలు ఆధారంగా మాత్రమే ఈ యాప్స్ ఇలాంటివి చేస్తుంటాయి.
Death Clock APPs లాంటి యాప్స్ కనిపిస్తే చాలు..
ఎవరైతే మరణ భయంతో బాధపడుతుంటారో వారికి ఇలాంటి యాప్స్ కనిపిస్తే చాలు దాన్ని చూస్తారు. ఐతే ఇది పూర్తిగా మనిషి మానసిక పరిస్థితిని పాడు చేస్తుంది. ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేయకుండా ఉంటేనే బెటర్. భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆలోచన కన్న ఈ నిమిషం మనం ఏం చేయాలి అన్న ఆలోచన ఉండటం బెటర్.
ఐతే ఇలాంటి వారి కోసం కొన్ని యాప్స్ ఇంటర్నెట్ లో ఉన్నాయి. ముందు చెప్పినట్టుగా డెత్ డేట్ కాలిక్యులేటర్.. లైఫ్ ఎక్స్ పెక్టన్సీ కాలిక్యులేటర్.. హోరో స్కోప్ యాప్స్ ఇవన్నీ ఇలాంటివి చూపిస్తాయి. ఐతే జనన మరణాలు మనిషి జ్యోతిష్యం మీద ఆధారపడి ఉంటాయన్నది సైన్స్ ప్రకారం నమ్మశక్యం కానిదని అంటుంటారు. అందుకే ఎవరి ఏది పూర్తిగా నమ్మాల్సిన అవసరం ఉండకూడదు. ఇలాంటి వాటి వల్ల మనిషి మరింత డల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.Death Clock, AI, Astrology, APPS