ఆపిల్ ఐఫోన్ లో ‘ I ‘ అంటే అర్థం ఏంటో తెలుసా ..??
ప్రస్తుతం కాలంలో సెల్ ఫోన్ వాడని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పిల్లలనుంచి పెద్దల దాక ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. ఎవరి స్థాయికి తగ్గట్టు వారు ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారు. సెల్ ఫోన్ మన జీవన శైలిలో ఒక భాగం అయిపోయింది. అది లేకపోతే మనుషి లేనట్లుగా ఉంది. ఇకపోతే ఫోన్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటి కంపెనీలు ధరకి అనుగుణంగా వాటిలో ప్రత్యేకతలు ఉంటాయి. మొబైల్ ఫోన్స్ ఎన్ని ఉన్నా కూడా ఐఫోన్ కి ప్రత్యేక స్థానం ఉంది. స్మార్ట్ ఫోన్ నుంచి ఉండే ఈ లుక్, స్టైల్ వేరే లెవెల్ లో ఉంటుంది.
సాధారణంగా చాలామంది ఐఫోన్ వాడుతున్న కూడా వారికి ఐఫోన్ లో ఐ గురించి తెలియకపోవచ్చు. ఐ ఫోన్లో మొదటి అక్షరం ఐఫోన్ లోని ఫీచర్స్ ని ఇంటర్నెట్ గురించి తెలియజేస్తుంది. ఐ అనే సాంప్రదాయం మొదటగా మొదలైంది. ఐమాక్స్ తోనే ఆపిల్ సంస్థ ప్రపంచానికి మొదటి కంప్యూటర్ ని 1998లో ప్రవేశపెట్టింది. కంప్యూటర్ ని కస్టమర్స్ కి సౌకర్యవంతంగా ఉండేలా మరియు ఇంటర్నెట్ చేరే విధంగా రూపకల్పన జరిగిందని ఆపిల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టీవ్ జాబ్స్ తెలిపారు. ఇది ఇంటర్నెట్ తో ఉపయోగించే పరికరం అని,
కస్టమర్ లకి అనుగుణంగా తయారు చేయబడిందని చెప్పారు. ఐఫోన్ లాంచింగ్ సమయంలో స్టీవ్ జాబ్స్ స్లైడ్స్ చూపిస్తూ ఐ యొక్క అర్థం చెప్పే ప్రయత్నం చేశారు. ఐ అంటే ఇంటర్నెట్, ఇండివిజువల్, ఇన్ స్ట్రక్ట్, ఇన్ఫర్మ్ ఇన్స్పైర్ అని చెప్పారు. ఐ అంటే ముఖ్యంగా ఇంటర్నెట్, ఇండివిజువల్ అని అర్థం. ఆపిల్ విడుదల చేసిన ఐవాచ్ గాని ఐపాడ్, ఐమాక్ అన్ని కూడా ఐ తో మొదలవుతాయి. ఆపిల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇంటర్నెట్ కి కనెక్ట్ చేసుకునే విధంగా ఉంటాయి. అందుకే ఐఫోన్ లో ఇంటర్నెట్ అర్థం వచ్చేలా ఐ అని పెట్టారు.