EMI : మీరు ప్రతి నెల EMI కడుతున్నారా..? అయితే ఇక నుండి మీ EMI అమౌంట్ తగ్గుతుంది.. ఎందుకంటే !
EMI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా నిర్ణయంతో హోమ్ లోన్, పర్సనల్ లోన్, కారు లోన్ తీసుకున్నవారికి ఊరట లభించనుంది. మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో రెపో రేటును మరోసారి 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం రెపో రేటు 6 శాతానికి చేరింది. RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఏప్రిల్ 7 నుంచి 9 వరకు ఈ సమావేశం జరిగింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగింపు, అమెరికా విధించిన సుంకాల ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
EMI : మీరు ప్రతి నెల EMI కడుతున్నారా..? అయితే ఇక నుండి మీ EMI అమౌంట్ తగ్గుతుంది.. ఎందుకంటే !
రెపో రేటు అనేది రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు అప్పుగా డబ్బులు ఇచ్చే వడ్డీ రేటు. ఇది తగ్గితే, బ్యాంకులు తమ కస్టమర్లకు ఇచ్చే లోన్లపై వడ్డీ రేటు తగ్గిస్తాయి. అందువల్ల హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ వంటి రుణాలపై మీరు కడుతున్న EMI కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మిడిల్ క్లాస్ ప్రజలకు ఎంతో ఊరటనిచ్చే అంశం. గత ఫిబ్రవరిలో కూడా RBI ఇదే విధంగా 0.25 శాతం రెపో రేటును తగ్గించి, ఈ ఏడాదిలో ఇది రెండోసారి కోత విధించడం జరిగింది.
ఇకపై కస్టమర్లు తక్కువ EMIలు చెల్లించే అవకాశమున్నా, ఇది పూర్తిగా బ్యాంకుల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ వ్యాఖ్యల ప్రకారం, వడ్డీ రేటు తగ్గించిన ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయడం అంత సులువు కాదు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో డబ్బు కొరత లేకపోవడం వల్ల ఈ నిర్ణయం మరింత ప్రభావవంతంగా మారే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, RBI ఈ నిర్ణయం సామాన్య రుణగ్రహితులకు తీపి కబురుగా నిలిచింది.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.