EMI : మీరు ప్రతి నెల EMI కడుతున్నారా..? అయితే ఇక నుండి మీ EMI అమౌంట్ తగ్గుతుంది.. ఎందుకంటే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

EMI : మీరు ప్రతి నెల EMI కడుతున్నారా..? అయితే ఇక నుండి మీ EMI అమౌంట్ తగ్గుతుంది.. ఎందుకంటే !

 Authored By ramu | The Telugu News | Updated on :9 April 2025,9:00 pm

EMI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా నిర్ణయంతో హోమ్ లోన్, పర్సనల్ లోన్, కారు లోన్ తీసుకున్నవారికి ఊరట లభించనుంది. మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో రెపో రేటును మరోసారి 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం రెపో రేటు 6 శాతానికి చేరింది. RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఏప్రిల్ 7 నుంచి 9 వరకు ఈ సమావేశం జరిగింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగింపు, అమెరికా విధించిన సుంకాల ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

EMI మీరు ప్రతి నెల EMI కడుతున్నారా అయితే ఇక నుండి మీ EMI అమౌంట్ తగ్గుతుంది ఎందుకంటే

EMI : మీరు ప్రతి నెల EMI కడుతున్నారా..? అయితే ఇక నుండి మీ EMI అమౌంట్ తగ్గుతుంది.. ఎందుకంటే !

RBI  రెపో రేటు తగ్గితే మీ EMI తగ్గేలా ఎలా?

రెపో రేటు అనేది రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు అప్పుగా డబ్బులు ఇచ్చే వడ్డీ రేటు. ఇది తగ్గితే, బ్యాంకులు తమ కస్టమర్లకు ఇచ్చే లోన్లపై వడ్డీ రేటు తగ్గిస్తాయి. అందువల్ల హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ వంటి రుణాలపై మీరు కడుతున్న EMI కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మిడిల్ క్లాస్ ప్రజలకు ఎంతో ఊరటనిచ్చే అంశం. గత ఫిబ్రవరిలో కూడా RBI ఇదే విధంగా 0.25 శాతం రెపో రేటును తగ్గించి, ఈ ఏడాదిలో ఇది రెండోసారి కోత విధించడం జరిగింది.

ఇకపై కస్టమర్లు తక్కువ EMIలు చెల్లించే అవకాశమున్నా, ఇది పూర్తిగా బ్యాంకుల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ వ్యాఖ్యల ప్రకారం, వడ్డీ రేటు తగ్గించిన ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయడం అంత సులువు కాదు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో డబ్బు కొరత లేకపోవడం వల్ల ఈ నిర్ణయం మరింత ప్రభావవంతంగా మారే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, RBI ఈ నిర్ణయం సామాన్య రుణగ్రహితులకు తీపి కబురుగా నిలిచింది.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది