Electric Bike : మార్కెట్లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ గేర్ల బైక్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Electric Bike : మార్కెట్లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ గేర్ల బైక్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే ..!

 Authored By aruna | The Telugu News | Updated on :22 November 2022,10:10 pm

Electric Bike : ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు బాగా పెరగడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుంది. రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఎక్కువ అవుతుంది. దీంతో కొత్త కొత్త మోడల్ లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లకు మరింత క్రేజ్ ఉంది. ఈ క్రమంలో భారత్ లో తొలిసారి గేర్లతో కూడిన ఎలక్ట్రిక్ బైక్ మోటార్ రాబోతున్న. టెక్నాలజీ స్టార్ట్ అప్ కంపెనీ మోటార్ పేర్లతో కూడిన ఎలక్ట్రిక్ బైక్లను తయారు చేసింది. ఈ కంపెనీ ఆహ్ అహ్మదాబాద్లో ఫ్యాక్టరీలో ఈ బైక్లను తయారుచేస్తుంది. ఈ క్రమంలో తొలి ఎలక్ట్రిక్ కేరళ బైక్ మార్కెట్లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది.

నాలుగు గేర్ బాక్స్ తో కూడిన ఎలక్ట్రిక్ బైక్ లో మేటర్ కంపెనీ మార్కెట్లోకి తీసుకు రాడుంది. ఇండియాలో అందుబాటులోకి రానున్న గేర్లతో కూడిన తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే. 7 ఇంచుల టచ్ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో కూడిన వెహికల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్ ఈ మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్‍కు ఉంటుంది. ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్‍ తో వస్తుంది. ఈ బైక్‍కు స్మార్ట్ ఫోన్ ను కనెక్ట్ చేసుకోవచ్చు. స్పీడ్, గేర్ పొజిషన్, రైడింగ్ మోడ్, నావిగేషన్, నోటిఫికేషన్ ఎలర్ట్స్, కాల్ కంట్రోల్, మ్యూజిక్ ప్లే బ్యాక్, లాంటి ఫంక్షన్స్ ఈ బైక్ డిస్‍ప్లే నుంచి చేసుకోవచ్చు. అలాగే ఈ బైక్ కు రివర్స్ ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది. ఈ బ్యాటరీ 5 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది.

first geared electric bike launch coming soon in india

first geared electric bike launch coming soon in india

ఈ బైక్ ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 125 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు వస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కు10.5కెడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. 520ఎన్‌ఎమ్ టార్క్యూను జనరేట్ చేస్తుంది. ఈ బైక్ మూడు రైడింగ్ మోడ్లతో వస్తుంది. సంప్రదాయ 4-స్పీడ్ గేర్ బాక్స్ తో ఇండియాలో లాంచ్ కానున్న తొలి ఎలక్ట్రిక్ బైక్ కానుంది. 2023 తొలి క్వార్టర్ లో మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ మొదలవుతాయని మ్యాటర్ కంపెనీ తెలిపింది. 2023 ఏప్రిల్ నాటికి బైక్ ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ బైక్ నియాన్, బ్లూ, గోల్డ్, బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది