Flipkart big deal on iPhone 14
Flipkart : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అయినటువంటి ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు వినియోగదారులకు భారీ డిస్కౌంట్ అందించబోతున్నాయి. అక్టోబర్ 8న దసరా, దీపావళి పండుగలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరిట వినియోగదారులకు భారీ డిస్కౌంట్ అందించబోతోంది. ఐఫోన్ న్యూ మోడల్స్ అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. శామ్‌సంగ్, వన్‌ప్లస్, రియల్‌మీ, మోటొరోలాలతో పాటు ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్ల పై భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ధర 50 వేల లోపే ఉండటం గమనార్హం. ఐఫోన్ 14 ధర 50 వేల లోపే ఉండవచ్చు అని, ఐఫోన్ 14 ప్లస్ 60 వేల లోపు గోలు చేయవచ్చని ఫ్లిప్కార్ట్ ప్రకటించినది.
ఈ డీల్ లో అక్టోబర్ 1 న ఫ్లిప్కార్ట్ సంస్థ రివీల్ చేసింది. రూ. 1999 చెల్లించి వినియోగదారుడు ఈ ధరను లాక్ చేసుకోవచ్చని ఫ్లిప్కార్ట్ తెలిపింది. అంతే కాకుండా దీనికి బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తిస్తాయి. బిగ్ బిలియన్ డేస్ లో అద్భుతమైన ఫీచర్స్ తో ఐఫోన్స్ ను అతి తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 14 ఫీచర్స్ 61 ఇంచుల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఐఫోన్ 14 ప్లస్ 6.7 ఇంచెస్ సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు మోడల్స్ కూడా హై బ్రైట్ నెస్ ను సపోర్ట్ చేస్తాయి.
Flipkart big deal on iPhone 14
ఈ రెండు మోడల్స్ ఫోన్‌లు 12MP ఫ్రంట్ కెమెరా, అదేవిధంగా వెనుక భాగంలో 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది యాక్షన్ మోడ్ తో కూడిన షాట్స్ తీయడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మోడల్స్ స్టోరేజ్ 128GB, 256GB, 512GBలో అందుబాటులో ఉంటాయి. మిడ్‌నైట్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్, బ్లూ, పర్పుల్, ఎల్లో కలర్స్ లో ఈ రెండు ఐఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. పండుగ సీజన్ కావడంతో ఫ్లిప్కార్ట్ సంస్థ బిగ్ బిలియన్ డేస్ నిర్వహిస్తోంది. ఐఫోన్ 14 అతి తక్కువ ధరకే లభిస్తుంది కాబట్టి వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఫ్లిప్కార్ట్ యాప్ లోకి వెళ్లి సందర్శించండి.
Sudigali Sudheer : తెలుగు బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ పెళ్లి విషయమై ఇటీవల మరోసారి చర్చలు…
Rakul Preet Singh : ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్…
Bollineni Krishnaiahహైదరాబాద్, మే 25: భారతీయ నాగరికతలకు మూలమైన సంస్కృతిని, సంస్కృత భాషలోనున్న శాస్త్రాలని సంరక్షించుకోకపోతే రేపటి తరాలకు బలమైన…
Sharmila Kavitha : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ అంశం రాజకీయ చర్చలకు తెరలేపింది. బీఆర్ఎస్…
Post Office : పొదుపు చేసే క్రమంలో ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ వచ్చే మార్గాలను ఈ రోజుల్లో…
Gangula Kamalakar : కవిత లేఖపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల…
Buddha Venkanna : వైసీపీ నేత పేర్ని నానిపై తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న తీవ్రమైన విమర్శలు చేశారు.…
Kavitha New Party : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికర వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన…
This website uses cookies.