Categories: NewsTechnology

Flipkart : భారీ ఆఫర్ తో రానున్న… ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్…

Flipkart : ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ టెక్నాలజీ బాగా వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ప్రతిదీ ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసేస్తున్నారు. అందుకనే కొన్ని ప్రముఖ కంపెనీలు కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్స్ పెడుతూ ఉంటారు. అయితే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సంస్థలు భారీ ఆఫర్లను కస్టమర్లకు అందిస్తున్నాయి. ఇప్పుడు పండగ సీజన్లు కాబట్టి భారీ ఆఫర్లను ప్రకటించబోతున్నారు. వినాయక చవితి, దసరా, దీపావళి పండగలు ఉండడంతో ఈ కామర్స్ దిగ్గజాలు భారీ ఆఫర్లతో వస్తున్నాయి. ఇక ప్రతి ఏడాది లాగానే ఫ్లిప్ కార్ట్ భారీ సేల్ తో ముందుకు రాబోతుంది. త్వరలోనే ఈ సేల్ వినియోగదారులకు అందుబాటులోకి రానుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

ఫ్లిప్ కార్ట్ త్వరలోనే బిగ్ బిలియన్స్ డే సేల్ ను తీసుకు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కానీ ఖచ్చితమైన డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ సేల్ లో బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల పై భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే మరో రెండు మూడు రోజుల్లో ఈ బిగ్ బిలియన్ డేస్ ప్రకటించే అవకాశం ఉంది. మరో రెండు వారాలు ఈ బిగ్ సేల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. బిగ్ బిలియన్ డే సేల్ లో భాగంగా ఎస్ బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులు పై 10 శాతం డిస్కౌంట్ ఉంటే అవకాశం ఉంది. అంతేకాకుండా 40 శాతం నుంచి 80% వరకు కొన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంది.

Flipkart discount offers big billion days sale

స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ లపై భారీ తగ్గింపు ఉండబోతుంది. స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు అలాగే హోమ్ అప్లైయన్సెస్ పై ఈ సెల్ లో 80 శాతం వరకు డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ల్యాప్ టాప్ లు, సౌండ్ బార్లు, బ్లూటూత్, ఇయర్ బడ్స్ లపై 70 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటించిన తర్వాత ప్రైమ్ మెంబర్స్ కు మాత్రం ఒకరోజు ముందుగానే సేల్ ప్రారంభం కానుంది. సాంసంగ్, ఆపిల్, రియల్ మీ, ఒప్పో, రెడ్ మీ, వివో వంటి ప్రముఖ బ్రాండ్లపై భారీ తగ్గింపు ఉండే అవకాశం ఉంటుంది.

Recent Posts

Vastu Tips | హిందూ మతంలో రావి చెట్టు ప్రాధాన్యం .. ఇంటి గోడలపై పెరిగితే శుభమా, అశుభమా?

Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…

44 minutes ago

Urea : ఆంధ్ర యూరియా తెలంగాణకు వస్తుందట..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు

Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…

10 hours ago

Allu Aravind : అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్..వెంటనే కూల్చేయాలని ఆదేశాలు

Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…

11 hours ago

Malla Reddy Key Comments on CBN : చంద్రబాబు పై మల్లన్న ప్రశంసలు..సైకిల్ ఎక్కేందుకేనా..?

Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…

12 hours ago

Kavitha : కేసీఆర్ బాటలో వెళ్తునంటున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…

13 hours ago

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్‌-జెడ్‌ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…

14 hours ago

Apple Event | ఆపిల్‌ ఈవెంట్‌ 2025: ఐఫోన్‌ 17 సిరీస్‌ లాంచ్‌కు సిద్ధం.. నాలుగు కొత్త మోడల్స్‌, ఆధునిక ఫీచర్లతో ప్రదర్శన

Apple Event | ఐఫోన్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన…

15 hours ago

Group 1 | గ్రూప్-1 మెయిన్స్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు .. మెరిట్ లిస్ట్ రద్దు, రీవాల్యుయేషన్ లేదా తిరిగి పరీక్షలు

Group 1 | గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…

16 hours ago