Flipkart : భారీ ఆఫర్ తో రానున్న… ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్… | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Flipkart : భారీ ఆఫర్ తో రానున్న… ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్…

Flipkart : ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ టెక్నాలజీ బాగా వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ప్రతిదీ ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసేస్తున్నారు. అందుకనే కొన్ని ప్రముఖ కంపెనీలు కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్స్ పెడుతూ ఉంటారు. అయితే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సంస్థలు భారీ ఆఫర్లను కస్టమర్లకు అందిస్తున్నాయి. ఇప్పుడు పండగ సీజన్లు కాబట్టి భారీ ఆఫర్లను ప్రకటించబోతున్నారు. వినాయక చవితి, దసరా, […]

 Authored By aruna | The Telugu News | Updated on :4 September 2022,8:00 pm

Flipkart : ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ టెక్నాలజీ బాగా వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ప్రతిదీ ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసేస్తున్నారు. అందుకనే కొన్ని ప్రముఖ కంపెనీలు కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్స్ పెడుతూ ఉంటారు. అయితే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సంస్థలు భారీ ఆఫర్లను కస్టమర్లకు అందిస్తున్నాయి. ఇప్పుడు పండగ సీజన్లు కాబట్టి భారీ ఆఫర్లను ప్రకటించబోతున్నారు. వినాయక చవితి, దసరా, దీపావళి పండగలు ఉండడంతో ఈ కామర్స్ దిగ్గజాలు భారీ ఆఫర్లతో వస్తున్నాయి. ఇక ప్రతి ఏడాది లాగానే ఫ్లిప్ కార్ట్ భారీ సేల్ తో ముందుకు రాబోతుంది. త్వరలోనే ఈ సేల్ వినియోగదారులకు అందుబాటులోకి రానుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

ఫ్లిప్ కార్ట్ త్వరలోనే బిగ్ బిలియన్స్ డే సేల్ ను తీసుకు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కానీ ఖచ్చితమైన డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ సేల్ లో బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల పై భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే మరో రెండు మూడు రోజుల్లో ఈ బిగ్ బిలియన్ డేస్ ప్రకటించే అవకాశం ఉంది. మరో రెండు వారాలు ఈ బిగ్ సేల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. బిగ్ బిలియన్ డే సేల్ లో భాగంగా ఎస్ బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులు పై 10 శాతం డిస్కౌంట్ ఉంటే అవకాశం ఉంది. అంతేకాకుండా 40 శాతం నుంచి 80% వరకు కొన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంది.

Flipkart discount offers big billion days sale

Flipkart discount offers big billion days sale

స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ లపై భారీ తగ్గింపు ఉండబోతుంది. స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు అలాగే హోమ్ అప్లైయన్సెస్ పై ఈ సెల్ లో 80 శాతం వరకు డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ల్యాప్ టాప్ లు, సౌండ్ బార్లు, బ్లూటూత్, ఇయర్ బడ్స్ లపై 70 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటించిన తర్వాత ప్రైమ్ మెంబర్స్ కు మాత్రం ఒకరోజు ముందుగానే సేల్ ప్రారంభం కానుంది. సాంసంగ్, ఆపిల్, రియల్ మీ, ఒప్పో, రెడ్ మీ, వివో వంటి ప్రముఖ బ్రాండ్లపై భారీ తగ్గింపు ఉండే అవకాశం ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది