House Tax : ఇంటి పన్ను చెల్లించేవారికి శుభవార్త… కొత్త మినహాయింపు ఎలా పని చేస్తుందంటే…!
ప్రధానాంశాలు:
House Tax : ఇంటి పన్ను చెల్లించేవారికి శుభవార్త... కొత్త మినహాయింపు ఎలా పని చేస్తుందంటే...!
House Tax : ఆస్తి లేదా ఇల్లు House Tax కొనడం అనేది పెద్ద మూలధన పెట్టుబడి ప్రక్రియ. ఇల్లు కొన్న తర్వాత కూడా దాన్ని మెయింటెయిన్ చేయడానికి లేదా చక్కని రూపాన్ని ఇవ్వడానికి చాలా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. అవే కాకుండా ఇంటి యజమాని సంబంధిత పరిపాలనకు ఇంటి పన్ను లేదా ఆస్తి పన్ను చెల్లించాలి . ఇంటి పన్నును లెక్కించడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయి? ఇంటి పన్ను అంటే.. పార్కులు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాలు, సేవలు, ఇతర సౌకర్యాలు వంటి పౌర సౌకర్యాలను అందించడానికి స్థానిక ప్రభుత్వాలు ఆస్తి పన్నును వసూలు చేస్తాయి. అలాగే ఆస్తి కలిగిన యజమానికి పన్ను విధించబడుతుంది. నివాసాలకు ఆనుకుని ఉన్న ఖాళీ ప్లాట్‌లకు భారతదేశంలో పన్ను విధించబడదు.

House Tax : ఇంటి పన్ను చెల్లించేవారికి శుభవార్త… కొత్త మినహాయింపు ఎలా పని చేస్తుందంటే…!
House Tax గొప్ప అవకాశం..
ఆస్తి పన్ను స్థానిక ప్రభుత్వాలచే వసూలు చేయబడుతుంది. పన్ను రేటు రాష్ట్రం, నగరం, పట్టణం, మండలాల వారీగా మారుతుంది. రాష్ట్రం, నగరం, పట్టణం, మండలాల వారీగా పన్ను రేటు మారుతూ ఉంటుంది. అందుకే, గణన కూడా మారుతూ ఉంటుంది. ఎండోమెంట్ విభాగం ప్రకారం ఇంటి పన్ను చెల్లించే యజమానులు ఆస్తి పరిమాణాన్ని బట్టి డిస్కౌంట్ లేదా ఉపశమనం పొందవచ్చు. ఏప్రిల్ నుండి తమ ఇంటి పన్ను జమ చేసే వారు రాయితీకి అర్హులు అవుతారు. సంవత్సరానికి 900 రూపాయలు కంటే ఎక్కువ అద్దె ఉన్న ఆస్తులకి 15 శాతం ట్యాక్స్ విధించబడుతుంది.ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు 10 శాతం తగ్గింపు , ఆగస్ట్ 1 మరియు డిసెంబర్ 31 మధ్య చేసిన చెల్లింపులకి 5 శాతం తగ్గింపు ఉంటుంది.
చిన్న ఇంటి యజమానులకి అందించే రాయితీలతో పాటు నిర్ధిష్ట వ్యక్తుల సమూహాలకి అదనపు మినహాయింపులు ఉన్నాయి. గతంలో రూ. 2.4 లక్షల వార్షిక అద్దెపై TDS కట్టాల్సి ఉండేది. బడ్జెట్ 2025 ప్రకారం, ఈ పరిమితిని రూ. 6 లక్షల కు పెంచారు. అంటే, ఇప్పుడు రూ. 6 లక్షల వరకు అద్దె అందుకునే భూస్వాములకు TDS మినహాయింపు లభించనుంది. అదనంగా, నెలవారీ TDS పరిమితిని రూ. 24,000 నుండి రూ. 50,000 కు పెంచారు. దీంతో చిన్న స్థాయి భూస్వాములు మరియు అద్దెదారులకు ఆర్థికంగా కొంత ఉపశమనం లభించనుంది.కేంద్ర బడ్జెట్ 2025లో తీసుకున్న ఈ నిర్ణయాలు ఇంటి యజమానులకు, భూస్వాములకు, చిన్న స్థాయి పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట కలిగించాయి.మీకు అన్ని అర్హతలు ఉంటే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80జీజీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం దక్కుతుంది. మీకు ప్రతినెలా రూ.5వేలు చొప్పున లేదా సంవత్సరానికి రూ.60వేల దాకా పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది.