LIC : మీరు LIC లో ఏదైనా పాలసీ కట్టారా. అయితే మీకు ఒక గుడ్ న్యూస్. LIC ఇప్పుడు కస్టమర్లకు ఎంతో మేలు చేసే విధంగా అడుగులు వేస్తుంది. ఈ కారణం వలన కస్టమర్లు రెండు రకాల లబ్ధిలు పొందుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు మీ కోసం. ప్రస్తుతం LIC గురించి తెలియని వారు ఉండరు. కస్టమర్లకు ఎంతో అద్భుతమైన జీవిత బీమా పాలసీల ను అందించటంలో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నది. దీనిలో పెట్టుబడులు పెడితే గ్యారెంటీగా రిటర్న్ వస్తాయి అన్న నమ్మకం ఒకటి ఉంటుంది. పైగా తక్కువ పెట్టుబడితో అందుబాటులో ఉండటం వలన ఎక్కువ మంది LIC లో పాలసీ లు తీసుకుంటూ ఉంటారు. అయితే పాలసీలు కట్టేవారు మాత్రమే కాకుండా LIC లో షేర్లు కొనేవారు కూడా ఉంటారు. 2022, మే నెలలో LIC స్టాక్ లిస్టింగ్ అయిన విషయం మీకు తెలిసినదే. ప్రస్తుతం ఈ ఏడాదిలో LIC ఇష్యూ చేసిన ధర ను దాటేసింది. జనవరిలో ఐపిఓ ధరను దాటేసిన LIC, SBI ని బీట్ చేసి మరి ఎంతో విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా నిలిచింది. అయితే ఎంత ఫాస్ట్ గా అయితే నిలిచిందో అంత తొందరగా ఈ LIC షేర్ విలువ అనేది పడిపోతూ వస్తుంది.
భారీ లాభాలు : ఈ LIC షేర్లు అనేవి దారుణంగా కుప్పకూలు తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది LIC లో షేర్లు కొన్నవారు కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. LIC లు దివాలా తీయటం ఖాయం అని అంటున్నారు. పాలసీలు కట్టిన వారు తమ డబ్బులు మీద ఆశలు కూడా వదిలేసుకోవలసి వస్తుంది అని కంగారు పడుతున్నారు.అయితే కట్ చేస్తే, పడిపోయిన షేర్లు అన్నీ కూడా ఒక్కసారిగా మళ్లీ పుంజుకున్నాయి. 2023, 24 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలతో ముగిసిన త్రైమాసి కంలో రూ.13,763 కోట్ల నికర లాభాలను సంస్థ ప్రకటించింది. ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహంగా ఉండటంతో ప్రతి షేర్ మీద ఆరు చొప్పున చివరి డివిడెండ్ ను కూడా ప్రకటించింది. ఈ సంస్థలో భారత ప్రభుత్వం 96.5% వాటా కలిగి ఉన్నది. కావున ప్రభుత్వం రూ.3,662 కోట్ల డివిడెంట్ లు అందుకోనున్నది…
ఆరోగ్య భీమా రంగంలో ప్రవేశం : ఈ తరుణంలో LIC అనేది ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో కూడా అడుగుపెడుతున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు కూడా LIC అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ను మాత్రమే అందించింది. కానీ ఇప్పటి నుండి ఆరోగ్య భీమాను కూడా అందించేందుకు రెడీగా ఉన్నది అని తెలిపింది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి LIC ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో కూడా మార్కెట్ లీడర్ గా ఎదగాలి అని భావిస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో తమ పరిధిలో విస్తరించి దిశగా అడుగులు వెయ్యనున్నారు. సామాన్యులపై బీమా ఖర్చులను తగ్గించేందుకు కూడా అందుబాటులో ఉన్న పలుమార్గాలను పార్లమెంటరీ పార్లల్ పరిశీలిస్తున్నది. ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు కూడా ఈ భీమా పాలసీలను తయారు చేయాలి అని LIC సిఫారిస్ చేస్తున్నది.
2022,23 ఆర్థిక ఏడాది చివరి నాటికి జారీ చేసినటువంటి 55 కోట్ల ఆరోగ్య భీమా పాలసీలలో కేవల 2.3 కోట్ల పాలసీలు మాత్రమే ఉన్నవి. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయాలే. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో ప్రవేశించి సామాన్యులకు ప్రయోజనాలు చేకూర్చాలని భావిస్తున్నారు. ఇప్పటికే LIC జీవిత బీమా పాలసీలు కట్టి ఉన్నవారికి ప్రస్తుతం రెండు రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి. LIC పెట్టుబడులు పెరగటం వలన పాలసీలు కట్టిన వారికి కూడా కంపెనీ స్ట్రాంగ్ గా నిలబడింది అన్న నమ్మకం, భరోసా కలగటం. రెండవది.హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్ లోకి ప్రవేశించటం వలన ఆ సంస్థ విస్తరణ అనేది పెరగటమే కాకుండా తక్కువ ప్రీమియంతో ఆరోగ్య భీమాను పొందే అవకాశాలు ఉండటం. అంతేకాక ఒకే సంస్థ నుండి అటు జీవిత బీమా, ఇటు ఆరోగ్య బీమా రెండు అందటం. ఇప్పుడు LIC కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చే అంశాలు. ప్రస్తుతం దీనికి తోడుగా LIC లాభాల బాటలో దూసుకుపోతున్న కారణం వలన సంస్థ LIC కస్టమర్లకు ఎంతో మేలు చేసే విధంగా పాలసీ విధానాలను తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకొక విషయం ఏమిటి అంటే. LIC తక్కువ ధరకు ఆరోగ్య భీ మాలు అందించటం వలన మిగతా ఇన్సూరెన్స్ కంపెనీల పై కూడా ప్రభావం పడుతుంది. ఈ పోటీలు తట్టుకొని నిలబడటానికి ప్రీమియమ్ లు తగ్గించే అవకాశాలు కూడా ఉండవచ్చు. కావున ఇది నాన్ LIC కస్టమర్లకు మేలు అనే చెప్పాలి…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.