WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు .. చూస్తే మతిపోవాల్సిందే..!
ప్రధానాంశాలు:
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు .. చూస్తే మతిపోవాల్సిందే..!
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ కొనసాగుతోంది. మెటా సంస్థ ఆధ్వర్యంలో నిత్యం వినూత్న ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లకు మరింత బెటర్ అనుభూతిని అందించేందుకు ముందడుగు వేస్తోంది. తాజాగా వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా గ్రూప్ చాట్స్ లో ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో గ్రూప్ హెడ్డర్ కింద చూపించే ఫీచర్ వినియోగదారులందరినీ ఆకట్టుకుంటోంది.

WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు .. చూస్తే మతిపోవాల్సిందే..!
WhatsApp iPhone యూజర్ల కోసం ప్రత్యేక ఫీచర్లు
iOS యూజర్ల కోసం వాట్సాప్ ఓ ప్రత్యేక స్కానింగ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని ద్వారా వేరే థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా డాక్యుమెంట్స్‌ను నేరుగా వాట్సాప్ నుంచే స్కాన్ చేసి షేర్ చేయవచ్చు. అంతేగాక, వాట్సాప్‌ను డిఫాల్ట్ మెసేజింగ్, కాలింగ్ యాప్‌గా మార్చుకునే అవకాశం కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. వీడియో కాల్ అనుభవాన్ని మెరుగుపరచేందుకు జూమ్ ఆప్షన్, క్లారిటీ కోసం టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేయడం వంటి ఫీచర్లు మరింత ఆకర్షణగా మారాయి.
WhatsApp చానల్స్ మరియు స్టేటస్‌లలో కొత్త మార్పులు
వాట్సాప్ ఛానల్స్‌లో కొత్త ఫీచర్లతో అడ్మిన్‌లు వీడియోలు (60 సెకన్ల లోపు) రికార్డు చేసి షేర్ చేయగలుగుతారు. అలాగే వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్‌లోకి మార్చుకునే ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఛానల్స్‌కు ప్రత్యేక QR కోడ్‌తో ఫాలోయర్లను సులభంగా పెంచుకునే అవకాశం కలుగుతుంది. స్టేటస్‌లో మ్యూజిక్ ట్రాక్ జత చేసే ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చి యూజర్లను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా, త్వరలో షేర్ చేసిన ఫోటోలను లేదా వీడియోలను అవతలి వ్యక్తి సేవ్ చేయకుండా నియంత్రించే ఆప్షన్‌ను వాట్సాప్ విడుదల చేయనున్నట్లు సమాచారం. వాయిస్, వీడియో కాల్స్‌కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్లు అభివృద్ధి దశలో ఉన్నాయి.