Jio 5G : దీపావళి నుంచి దేశంలో రానున్న జియో 5జి సేవలు… ప్రకటించిన అంబానీ…
Jio 5G : ఇండియాలో ప్రముఖ టెలికాం కంపెనీ అయిన జియో యొక్క 5జి సేవలు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే వినియోగదారులకు 5జి సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన రిలయన్స్ 45వ వార్షిక సాధారణ సమావేశం భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీపావళి నాటికి ముంబై, చెన్నై, కోల్ కతా వంటి నగరాల్లో జియో 5జి అందుబాటులోకి రానుందని అంబానీ ప్రకటించారు. జియో 5జి సేవల ద్వారా కస్టమర్లు సూపర్ ఫాస్ట్ వేగంతో ఇంటర్నెట్ను పొందుతారని ఆయన చెప్పారు. 5జి కోసం రెండు లక్షల కోట్లను వెచ్చించి కంపెనీ ప్రత్యేక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది.
భారతీయ సంస్థల కోసం జియో ప్రైవేట్ 5జి సొల్యూషన్ కూడా అందిస్తుంది. Jio True 5G సేవలు 1Gbps కంటే ఎక్కువ గరిష్ట డౌన్లోడ్ స్పీడును పొందవచ్చు. ఇది వైర్డ్ బ్రాడ్ బ్రాండ్ నెట్వర్క్లకంటే వేగవంతమైనదని కంపెనీ పేర్కొంది. Jio True 5G తక్కువ లేట్ ఎంసి క్లౌడ్ గేమింగ్ సామర్ధ్యాలతో పాటు మెరుగైన వీడియో కాలింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుందని కంపెనీ తెలిపింది. Jio AirFiber అనేది జియో ట్రూ 5జి టెక్నాలజీ పై ఆధారపడి ఉంటుంది. ఇది అల్ట్రా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ తో కూడిన వైర్లెస్ సింగిల్ డివైస్ సొల్యూషన్ అని చెప్పవచ్చు. లైవ్ స్పోర్టింగ్ యాక్షన్ సమయంలో జియో ఎయిర్ ఫైబర్ హైడెఫిషియన్లో కెమెరా యాంగిల్స్ యొక్క మల్టీ స్క్రీన్ లను చూపుతుంది. ఈ సందర్భంగా కంపెనీ JioCloud PC ని కూడా ప్రకటించింది
ప్రస్తుతం ఇండియాలో 800 మిలియన్ల కనెక్ట్ చేయబడిన డివైస్ లు ఉన్నాయి. 5జి నెట్వర్క్ యొక్క రోల్ అవుట్ తర్వాత ఆ సంఖ్య రెండింతలు పెరుగుతుందని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో సరసమైన 5జి స్మార్ట్ ఫోన్ లను అభివృద్ధి చేయడానికి కంపెనీ గూగుల్ తో పనిచేస్తుంది. 5జి సేవలను విస్తరించేందుకు ప్రముఖ టెక్ కంపెనీ లైన్ ,మెటా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎరిక్సన్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలతో జతకట్టినట్లు అంబానీ పేర్కొన్నారు. అలాగే ఈ వార్షికోత్సవ సందర్భంగా అంబానీ తమ కంపెనీకి భవిష్యత్తు లీడర్లను ప్రకటించారు. భవిష్యత్తులో తమ వ్యాపార బాధ్యతలను చూసుకునే లీడర్లను ప్రకటించారు. జియో బాధ్యతల్ని ఆకాష్ అంబానీ, రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని ఇషా అంబానీ, రిలయన్స్ న్యూ ఎనర్జీ వ్యాపార బాధ్యతల్ని అనంత్ అంబానీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.